త్రిష... 96 | Trisha ... 96 | Sakshi
Sakshi News home page

త్రిష... 96

Dec 23 2016 2:06 AM | Updated on Sep 4 2017 11:22 PM

త్రిష... 96

త్రిష... 96

త్రిష 96. ఏమిటీ షాక్‌ అయ్యారా? చెన్నై చిన్నది త్రిషకు 96కు ఏమిటీ సంబంధం అనేగా మీ సందేహం.

త్రిష 96. ఏమిటీ షాక్‌ అయ్యారా? చెన్నై చిన్నది త్రిషకు 96కు ఏమిటీ సంబంధం అనేగా మీ సందేహం. సంబంధం ఉంది. అయితే ఈ సంఖ్య ఆమె వయసుకు చెందినది మాత్రం కాదు. అలాగని అదృష్ట సంఖ్య అసలు కాదు. త్రిష కెరీర్‌ మధ్యలో కాస్త నిదానంగా సాగినా, ఇప్పుడు మాత్రం జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతుందనే చెప్పాలి. ఒక పక్క లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రాలు, మరో పక్క ప్రముఖ హీరోలతో చిత్రాలు, ఇంకో పక్క యువ కథానాయకులతో రొమాన్స్ చేసే చిత్రాలంటూ అమ్మడి సినీ లైఫ్‌ మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగుతోంది.

ఇటీవల ధనుష్‌కు ప్రతినాయకిగా కొడి చిత్రంలో నటించి శభాష్‌ అనిపించుకున్న ఈ బ్యూటీ చేతిలో మరో మూడు చిత్రాలకు పైగా ఉన్నాయి. త్రిష సెంటరిక్‌ పాత్రలో నటిస్తున్న మోహిని చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం అరవింద్‌స్వామికు జంటగా చతురంగవేట్టై–2 చిత్రంలో నటిస్తున్నారు. యువ నటుడు విజయ్‌సేతుపతి సరసన మరో చిత్రం చేయడానికి ఆల్‌రెడీ పచ్చజండా ఊపారు. నడువుల కొంచెం పక్కత్తు కానోం చిత్రం ఫేమ్‌ ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో త్రిష పాత్ర విజయ్‌సేతుపతి పాత్రకు దీటుగా ఉంటుందట.ఈ చిత్రం పేరే 96. స్క్రిప్ట్‌ డిమాండ్‌ మేరకే ఈ టైటిల్‌ను నిర్ణయించినట్లు దర్శకుడు ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. చిత్ర కథకు 1996 సంవత్సరానికి లింక్‌ ఉంటుందట.అయితే ఇది ప్రస్తుత టైటిల్‌నేనని, చిత్రానికి రాయితీల సమస్య తలెత్తితే ఆ టైటిల్‌ మారే అవకాశం లేకపోలేదని దర్శకుడు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement