breaking news
caturangavettai -2
-
త్రిష... 96
త్రిష 96. ఏమిటీ షాక్ అయ్యారా? చెన్నై చిన్నది త్రిషకు 96కు ఏమిటీ సంబంధం అనేగా మీ సందేహం. సంబంధం ఉంది. అయితే ఈ సంఖ్య ఆమె వయసుకు చెందినది మాత్రం కాదు. అలాగని అదృష్ట సంఖ్య అసలు కాదు. త్రిష కెరీర్ మధ్యలో కాస్త నిదానంగా సాగినా, ఇప్పుడు మాత్రం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుందనే చెప్పాలి. ఒక పక్క లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాలు, మరో పక్క ప్రముఖ హీరోలతో చిత్రాలు, ఇంకో పక్క యువ కథానాయకులతో రొమాన్స్ చేసే చిత్రాలంటూ అమ్మడి సినీ లైఫ్ మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగుతోంది. ఇటీవల ధనుష్‌కు ప్రతినాయకిగా కొడి చిత్రంలో నటించి శభాష్ అనిపించుకున్న ఈ బ్యూటీ చేతిలో మరో మూడు చిత్రాలకు పైగా ఉన్నాయి. త్రిష సెంటరిక్ పాత్రలో నటిస్తున్న మోహిని చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం అరవింద్స్వామికు జంటగా చతురంగవేట్టై–2 చిత్రంలో నటిస్తున్నారు. యువ నటుడు విజయ్‌సేతుపతి సరసన మరో చిత్రం చేయడానికి ఆల్రెడీ పచ్చజండా ఊపారు. నడువుల కొంచెం పక్కత్తు కానోం చిత్రం ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో త్రిష పాత్ర విజయ్‌సేతుపతి పాత్రకు దీటుగా ఉంటుందట.ఈ చిత్రం పేరే 96. స్క్రిప్ట్ డిమాండ్ మేరకే ఈ టైటిల్‌ను నిర్ణయించినట్లు దర్శకుడు ప్రేమ్‌కుమార్ తెలిపారు. చిత్ర కథకు 1996 సంవత్సరానికి లింక్ ఉంటుందట.అయితే ఇది ప్రస్తుత టైటిల్నేనని, చిత్రానికి రాయితీల సమస్య తలెత్తితే ఆ టైటిల్ మారే అవకాశం లేకపోలేదని దర్శకుడు పేర్కొన్నారు. -
విజయ్‌సేతుపతితో రొమాన్స్‌కు సై!
స్టార్ హీరోలతో జత కట్టిన నేటి టాప్ హీరోయిన్లు ఇప్పుడు యంగ్ హీరోలతో జోడి కట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పవచ్చు. నయనతార,తమన్నా, కాజల్‌అగర్వాల్ ఇలా ప్రముఖ కథానాయికలందరికీ యువకథానాయకులతో నటించే అవకాశాలు తలుపుతడుతున్నాయి. తాజాగా నటి త్రిషకు కూడా అలాంటి అవకాశం వచ్చిందని సమాచారం. మరో విషయం ఏమిటంటే సాధారణంగా హీరోయిన్లు నాలుగైదేళ్ల కంటే ఎక్కువ కాలం మన్నగలగడం కష్టం. అలాంటిది నయనతార, అనుష్క, త్రిష లాంటి చాలా తక్కువ మంది దశాబ్దం దాటి నాయికలుగా రాణిస్తున్నారు. అందులోనూ వీరికి వయసు పెరుగుతున్న కొద్దీ అవకాశాలు అధికం అవుతుండడం గమనార్హం.ప్రస్తుతం చేతి నిండా చిత్రాలు ఉన్న తారామణుల్లో త్రిష ఒకరు. తను నటిస్తున్న తాజా చిత్రం మోహిని ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలై ఇప్పటికే భారీ అంచనాలను సంతరించుకుంది. ధనుష్‌తో నటించిన కొడి చిత్రం దీపావళికి తెరపైకి రానుంది. కాగా అరవిందస్వామికి జంటగా నటిస్తున్న చతురంగవేట్టై-2 చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. ఇకపోతే యువ నటుడు విజయ్‌సేతుపతితో రొమాన్స్ చేయడానికి ఈ చెన్నై చిన్నది రెడీ అవుతున్నారన్న తాజా సమాచారం. విజయ్‌సేతుపతికి కథానాయకుడిగా పెద్ద బ్రేక్ ఇచ్చిన చిత్రం నడువుల కొంచెం పక్కత్త కానోమ్. ఈ చిత్ర చాయాగ్రహకుడు సి.ప్రేమ్‌కుమార్ ఇప్పుడు దర్శకుడిగా మెగాఫోన్ పట్టనున్నారు. ఇందులో విజయ్‌సేతుపతినే హీరో. ఆయనకు జంటగా కథ ప్రముఖ హీరోయిన్లను డిమాండ్ చేసిందట. దీంతో నయనతారను గానీ, త్రిష గానీ ఎంపిక చేయాలని భావించిన చిత్ర దర్శక నిర్మాతలు చివరికి త్రిష వైపే మొగ్గు చూపినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆ ముద్దుగుమ్మ కూడా విజయ్‌సేతుపతితో రొమాన్స్ చేయడానికి సై అన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని నందగోపాల్ నిర్మించనున్నట్లు, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది.