తుఫాన్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల.. | Toofan FIrst Look Poster Released By Farhan Akhtar | Sakshi
Sakshi News home page

తుఫాన్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల..

Sep 30 2019 4:32 PM | Updated on Sep 30 2019 4:37 PM

Toofan FIrst Look Poster Released By Farhan Akhtar - Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటుడు, ‘బాగ్‌మిల్కాబాగ్‌’ ఫేమ్‌ ఫర్హాన్‌ అక్తర్‌ తన కొత్త సినిమా తుఫాన్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. బాక్సింగ్ రింగ్‌లో సాధన చేస్తున్న ఫొటో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. వచ్చే ఏడాది అక్టోబర్‌ 2న తుఫాన్‌ చిత్రాన్ని విడుదల చేయనున్నామని అక్తర్‌ ట్వీట్‌ చేశారు. స్పోర్ట్స్ డ్రామాతో కూడిన ఫిక్షన్‌ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు ఓమ్‌ప్రకాశ్‌ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన బాగ్‌మిల్కాబాగ్‌ సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.  

తుఫాన్‌ సినిమా షూటింగ్‌కు ముందు నుంచే  ఫర్హాన్‌ తన పాత్ర కోసం సాధన చేయడం విశేషం. బాలీవుడ్‌ నటుడు పరేష్ రావల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నారు. ‘అద్భుత నటుడు ఫర్హాన్‌తో నటించడం థ్రిల్‌కు గురిచేస్తుంద’ని పరేష్‌ రావల్‌ ట్వీట్‌ చేశారు. ఈ సినిమాకు  ఫర్హాన్‌ అక్తర్‌ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement