స్క్రీన్‌ టెస్ట్‌ | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Fri, Jan 11 2019 3:12 AM

tollywood movies special screen test10 jan 2019 - Sakshi

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎలా ఏ స్థాయికి వెళతారో ఎవరూ ఊహించలేరు. అందుకే సినిమా అనేది చాలా మందికి డ్రీమ్‌. ఆ కలకి నాయకుడు దర్శకుడు. అందుకే దర్శకుణ్ణి ‘కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌’ అంటారు. సినిమా ఇండస్ట్రీలోని అనేక శాఖల్లో పని చేసిన అనుభవంతో మెగాఫోన్‌ పట్టిన దర్శకుల గురించి ఈ వారం క్విజ్‌ స్పెషల్‌...

1. ఈయన మొదట దర్శకుడు కాదు. ఎడిటింగ్‌ శాఖలో ప్రముఖ ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. తర్వాత చాలా పెద్ద దర్శకుడయ్యారు. ఎవరా డైరెక్టర్‌?
ఎ) శ్రీను వైట్ల  బి) వీవీ వినాయక్‌  సి) వంశీ పైడిపల్లి   డి) ఎస్‌.ఎస్‌ రాజమౌళి

2. నటిగా ఉన్నత శిఖరాలను అధిరోహించారామె. ‘చిన్నారి పాపలు’ అనే చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు. ఎవరా హీరోయిన్‌?
ఎ) ‘షావుకారు’ జానకి బి) జమున సి) సావిత్రి డి) వాణిశ్రీ

3. ఈ ప్రముఖ హీరోల్లో ఓ హీరో మెగాఫోన్‌ పట్టుకోలేదు. ఆయనెవరో కనుక్కోండి?
ఎ) అక్కినేని     బి) కృష్ణ  సి) యన్టీఆర్‌     డి) చిత్తూరు వి. నాగయ్య

4. దర్శకత్వం చేయకముందు నంబర్‌ ప్లేట్లకు స్టిక్కర్‌ డిజైనింగ్‌ చేయడంలో అందెవేసిన చెయ్యి ఈ దర్శకునిది. ఎవరా దర్శకుడు?
ఎ) సుధీర్‌వర్మ బి) మారుతి సి) చిన్నికృష్ణ డి) విరించివర్మ

5. ప్రభాస్‌ నటించిన ‘మిర్చి’ చిత్రంతో దర్శకునిగా మారారు. అంతకుముందు ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఇంతకీ ఎవరా దర్శకుడు?
ఎ) బోయపాటి శ్రీను   బి) వక్కంతం వంశీ  సి) కొరటాల శివ         డి) దశరథ్‌

6 నటి విజయశాంతి మేకప్‌మేన్‌గా ఈయన సుపరిచితుడు. ‘పెద్దరికం’ చిత్రానికి దర్శకత్వం వహించి విజయం సాధించారు. భారీ బడ్జెట్‌ చిత్రాల నిర్మాతగానూ పేరుంది. ఎవరతను?
ఎ) బండ్ల గణేష్‌       బి) ‘దిల్‌’ రాజు   సి) ఏ.యం.రత్నం   డి) కాస్ట్యూమ్స్‌ కృష్ణ

7. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా 400 చిత్రాలకు పైగా పని చేశారీయన. తన దర్శకత్వ ప్రతిభతో కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎవరా నటుడు?
ఎ) చలం బి) పద్మనాభం సి) రాజబాబు డి) రేలంగి

8. పవన్‌ కల్యాణ్‌ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘జానీ’. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో అల్లు అరవింద్‌ నిర్మించారు. ఆ చిత్రంలో పవన్‌ సరసన నటించిన కథానాయిక ఎవరో కనుక్కోండి?
ఎ) కీర్తి రెడ్డి  బి) రేణూ దేశాయ్‌  సి) సుప్రియ     డి) అమీషా పటేల్‌

9. 1957లో ‘పాండురంగ మహత్యం’ సినిమాలో బాలకృష్ణుని పాత్రలో నటించారీమె. 1971లో ‘మీనా’ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఎవరా ప్రముఖ నటి?
ఎ) బి.సరోజాదేవి    బి) కృష్ణకుమారి  సి) కాంచన  డి) విజయనిర్మల

10. తమిళ నటుడు జీవా, కార్తీక కాంబినేషన్లో తమిళ్, తెలుగులో విడుదలైన చిత్రం ‘రంగం’. ఆ  చిత్రానికి దర్శకత్వం వహించింది ప్రముఖ కెమెరామేన్‌. ఆ కెమెరామేన్‌ పేరేంటో కనుక్కోండి?
ఎ) పీసీ శ్రీరామ్‌     బి) రాజీవన్‌ సి) కేవీ ఆనంద్‌     డి) రసూల్‌ ఎల్లోర్‌

11. నటునిగా 150 చిత్రాలను పూర్తి చేసుకున్నారు యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌. ఆయన దర్శకునిగా మారి ఎన్ని చిత్రాలు తెరకెక్కించారో తెలుసా?  
ఎ) 5 బి) 8 సి) 7 డి) 11

12. 1949లో యన్టీఆర్‌ నటించిన మొదటి చిత్రం ‘మన దేశం’ రిలీజైంది. 1961లో ఆయన తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఆ చిత్రం పేరేంటి?
ఎ) తల్లా? పెళ్లామా?     బి) వరకట్నం  సి) సీతారామ కల్యాణం     డి) శ్రీకృష్ణ పాండవీయం

13. దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్‌ మొదట దర్శకత్వ శాఖలో పనిచేయలేదు. సినీ పరి శ్రమలో మొదట ఆయన ఏ శాఖలో పనిచేశారో తెలుసా?
ఎ) ఎడిటింగ్‌  బి) కెమెరా  సి) ఆడియోగ్రాఫర్‌ డి) కొరియోగ్రాఫర్‌

14 కమల్‌హాసన్‌ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘చాచీ 420’. ఆ చిత్రంలో హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) టబు బి) గౌతమి సి) అమలా డి) రమ్యకృష్ణ

15.  ‘మణికర్ణిక’ చిత్రానికి మొదట దర్శకునిగా చాలా బాగాన్ని చిత్రీకరించారు క్రిష్‌. ఆ తర్వాత ఆయన ‘యన్టీఆర్‌’ బయోపిక్‌ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం వల్ల మిగతా చిత్రాన్ని కంప్లీట్‌ చేసిన నాయిక ఎవరో చెప్పుకోండి?
ఎ) ఆలియా భట్‌  బి) దీపికా పదుకోన్‌ సి) కంగనా రనౌత్‌    డి) ప్రియాంకా చోప్రా

16 హీరో కృష్ణ దాదాపు 230 సినిమాల్లో నటించిన తర్వాత ‘సింహాసనం’ చిత్రం ద్వారా దర్శకునిగా మారారు. ఆ సినిమాలో విషకన్య పాత్ర ద్వారా తెలుగులో నటించిన బాలీవుడ్‌ నటి ఎవరో తెలుసుకుందామా?
ఎ) దివ్యభారతి బి) రేఖ సి) హేమమాలిని డి) మందాకిని

17. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన చిత్రం ‘చండీరాణి’. ఆ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమైన ఫేమస్‌ హీరోయిన్‌ ఎవరు?
ఎ) భానుమతి బి) లక్ష్మీ   సి) యస్‌.వరలక్ష్మీ డి) అంజలీదేవి

18. ఆయనో ప్రముఖ నిర్మాత. అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో దర్శకుడయ్యారు. తను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘దసరాబుల్లోడు’తో సంచలన విజయం నమోదు చేశారు. ఆ దర్శక–నిర్మాత ఎవరో తెలుసా?
ఎ) వీబీ రాజేంద్రప్రసాద్‌   బి) కేయస్‌ ప్రకాశరావు  సి) క్రాంతికుమార్‌     డి) మురారి

19. సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు తేజ. ఆయన దర్శకుడు కాకముందు ఫేమస్‌ సినిమాటోగ్రాఫర్‌. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఏంటో గుర్తుందా?
ఎ) జయం బి) చిత్రం సి) నిజం డి) ధైర్యం

20. తరుణ్, రాజా, సలోనిలు ముఖ్య పాత్రలుగా నటించిన చిత్రం ‘ఒక ఊరిలో’. ఆ చిత్రంతో దర్శకునిగా మారారు రమేశ్‌వర్మ. దర్శకుడు కాకముందు ఆయన ఏం చేసేవారో తెలుసా?
ఎ) స్టిల్‌ ఫొటోగ్రఫీ  బి) ఆర్ట్‌ డైరెక్టర్‌  సి) పోస్టర్‌ డిజైనర్‌  డి) మ్యూజిక్‌ డైరెక్టర్‌

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) డి 2) సి 3) ఎ 4) బి  5) సి 6) సి 7) బి 8) బి 9) డి 10) సి
11) డి 12) సి 13) సి 14) ఎ 15) సి 16) డి  17) ఎ 18) ఎ 19) బి  20) సి



నిర్వహణ: శివ మల్లాల

Advertisement
Advertisement