స్క్రీన్‌ టెస్ట్‌

tollywood movies special screen test - Sakshi

 ‘ఆడొచ్చాడు.. ఆడి కొడుకొచ్చాడని చెప్పు’... ‘మిర్చి’ సినిమాలో ఫేమస్‌ డైలాగ్‌ ఇది. తండ్రికి తగ్గ వారసుడిగా సినిమాలో ప్రత్యర్థిపై ప్రభాస్‌ సవాల్‌ విసురుతాడు. రియల్‌ లైఫ్‌లో వారసులు ఇలాంటి డైలాగ్‌ చెప్పకపోయినా... తల్లిదండ్రులకు తగ్గ బిడ్డలు అనిపించుకోవాలని అనుకుంటారు. మామూలుగా వారసులంటే ఎక్కువ శాతం అబ్బాయిలే ఉంటారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో... ఇది నిన్నటి కథ.  ఇప్పుడు
అమ్మాయిల జోరు కూడా పెరిగింది. ‘లేడీ వారసుల’ హవాతో ఈ వారం స్పెషల్‌ క్విజ్‌.

1 ఇందిరా ప్రొడక్షన్స్‌ అధినేత మంజుల అనగానే సూపర్‌స్టార్‌ కృష్ణ కూతురని అందరికీ తెలుసు. మహేశ్‌బాబు అక్కగా ఆమె ఫేమస్‌. ఈ మధ్య ఆమె ఓ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో హీరో ఎవరో కనుక్కోండి?
ఎ) వరుణ్‌ సందేశ్‌    బి) సందీప్‌ కిషన్‌
సి) ప్రిన్స్‌  డి) అరవింద్‌ కృష్ణ

2 విజయ్‌ హీరోగా నటించిన ‘సర్కార్‌’ సినిమాలో హీరోయిన్‌ కీర్తీ సురేశ్‌. ఆ చిత్రంలో ప్రతి నాయకురాలి పాత్రలో మెప్పించిన నటి ఎవరో తెలుసా? (ఆమె తమిళ హీరో శరత్‌ కుమార్‌ కూతురు)
ఎ) సమంత      బి) వరలక్ష్మి
సి) తమన్నా      డి) సాయి పల్లవి

3 యన్టీఆర్‌ హీరోగా నటించిన ‘దమ్ము’ చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటించారు త్రిష. మరో హీరోయిన్‌గా నటించింది ప్రముఖ నటి రాధ కూతురు. ఆమె పేరేంటి?
ఎ) లక్ష్మీ మీనన్‌     బి) తులసి  
సి) కార్తీక             డి) శరణ్యా మోహన్‌
 
4 తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఇద్దరు కుమార్తెలు. ఒకరు సౌందర్య, మరొకరు ఐశ్వర్యా ధనుష్‌. ఇద్దరూ దర్శకులే. వీరిలో కార్తీ హీరోగా నటించిన ఓ సినిమాకి ఐశ్వర్య తన గొంతును అరువిచ్చారు. ఆమె ఏ హీరోయిన్‌కి డబ్బింగ్‌ చెప్పారో తెలుసా?
ఎ) రిమ్మీసేన్‌       బి) రియాసేన్‌
సి) రీమాసేన్‌       డి) రైమాసేన్‌

5 సంగీత దర్శకుడు యస్‌.యస్‌. తమన్‌తో కలిసి ‘రేసుగుర్రం’ చిత్రంలోని ‘డౌన్‌ డౌన్‌ డుప్ప డుప్ప...’ సాంగ్‌ను పాడిన సింగర్‌ ఎవరో తెలుసా? (ఆమె ప్రముఖ హీరో కూతురు)
ఎ) అమలా పాల్‌  బి) శ్రుతీహాసన్‌
సి) ఆండ్రియా డి) ఐశ్వర్యా అర్జున్‌

6 ‘ముద్దపప్పు ఆవకాయ్‌’ అనే వెబ్‌ సిరీస్‌ను నిర్మించి, నటించటంతో పాటు తన ఫిల్మ్‌ కెరీర్‌ను ప్రారంభించిన ‘ఒక మనసు’ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) నిహారిక బి) స్వాతి సి) ఇషా రెబ్బా   డి) తేజస్వి మడివాడ

7 అఖిల్‌తో ‘హలో’ చెప్పి తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంటరైన కళ్యాణి ఓ హీరోయిన్‌ కుమార్తె. ఆమె తండ్రి పెద్ద దర్శకుడు. ఈమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందు ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ సాబు సిరిల్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. కళ్యాణి అమ్మ గారి పేరేంటి?
ఎ) వాణీ విశ్వనాథ్‌     బి) అంబిక  
సి) లిజి           డి) ఊర్వశి

8 విలక్షణ నటునిగా పేరున్న నటుడు మోహన్‌బాబు. ఆయన కుమార్తె మంచు లక్ష్మీప్రసన్న పేరు మీదే ఆయన చిత్రనిర్మాణ సంస్థ ఉంది. ఆమె ఇంగ్లీషు, తెలుగు, తమిళ సినిమాలతో పాటు అనేక టీవీ షోస్‌ చేశారు. ఆమె ఏ తమిళ దర్శకుని చిత్రంలో నటించారో తెలుసా?
ఎ) మణిరత్నం బి) బాలచందర్‌   సి) భారతీరాజా డి) పి. వాసు

9 చిరంజీవి పెద్ద కుమార్తె, రామ్‌చరణ్‌ అక్క సుస్మిత సినీ రంగంలో
రాణిస్తున్నారు. ఆమె ఏ శాఖలో తన ఉనికిని చాటుకుంటున్నారో కనుక్కోండి?

ఎ) ఎడిటింగ్‌   బి) ఫొటోగ్రఫీ   సి) ప్రొడ్యూసర్‌   డి) ఫ్యాషన్‌ డిజైనర్‌

10 ‘సాహెబా సుబ్రమణ్యం’ అనే సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి దర్శకురాలిగా అడుగు పెట్టారు శశికిరణ్‌. ఆమె ఓ ప్రముఖ కమెడియన్‌ కూతురు. ఎవరా కమెడియన్‌ కనుక్కోండి?
ఎ) ఏ.వి.యస్‌       బి) యం.యస్‌. నారాయణ
సి) ధర్మవరపు సుబ్రమణ్యం   డి) ఎల్బీ శ్రీరామ్‌
 
11 అడివి శేష్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఆయన సరసన హీరోయిన్‌గా నటిస్తున్న నటి ఎవరు? (ఆ హీరోయిన్‌ వాళ్ల అమ్మానాన్న ఇద్దరూ సినీ పరిశ్రమలో ఉన్నారు)
ఎ) శివాత్మిక       బి) రష్మికా మండన్నా  
సి) శివాని           డి) చేతన

12 హీరో కమల్‌హాసన్‌ అన్న ప్రముఖ నటుడు చారుహాసన్‌. ఆయన కుమార్తె మొదట కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసి తర్వాత పెద్ద హీరోయిన్‌ అయ్యారు ఆమె పేరేంటి?
ఎ) జయసుధ         బి) భానుప్రియ
సి) సుహాసిని          డి) విజయశాంతి

13 తెలుగులో ‘రక్తకన్నీరు’ నాగభూషణం లానే తమిళ్‌లో యం.ఆర్‌. రాధ అనే నటుడు చాలా ఫేమస్‌. ఆయన కూతురు దక్షిణాదిన పాపులర్‌ హీరోయిన్‌. ఆమె పేరేంటి?
ఎ) రాధిక         బి) రాధ
సి) సుమలత     డి) జయప్రద

14 1989లో విడుదలైన ‘అడవిలో అభిమన్యుడు’ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు నటి ఐశ్వర్య. ఆమె ప్రముఖ హీరోయిన్‌ లక్ష్మి కుమార్తె. ఆమె ఏ హీరోతో తన సినీ ప్రయాణం మొదలుపెట్టారో తెలుసా?
ఎ) జేడీ చక్రవర్తి     బి) వడ్డే నవీన్‌  
సి) జగపతిబాబు    డి) శ్రీకాంత్‌

15 ప్రముఖ నటుడు అజిత్‌ నటించిన తమిళ చిత్రం ‘వివేగం’లో ఆయన సరసన హీరోయిన్‌గా నటించారు కాజల్‌ అగర్వాల్‌. మరో నటి కీలక పాత్ర చేశారు. ఆమె పేరేంటి? (ఆమె తండ్రి తమిళ, తెలుగు సినీరంగంలో మంచి పేరున్న నటుడు)
ఎ) అమలాపాల్‌ బి) శ్రుతీహాసన్‌
సి) అక్షర హాసన్‌ డి) కీర్తీసురేశ్‌

16 వరలక్ష్మీ శరత్‌కుమార్‌.. ఈ పేరు ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో చాలా ఫేమస్‌. ఆమెను హీరోయిన్‌గా మొదట పరిచయం చేసిన దర్శకుని పేరేంటో తెలుసా? (ఆయన ఇప్పుడు చాలా ఫేమస్‌ హీరోయిన్‌తో ఎఫైర్‌లో ఉన్నాడు)
ఎ) ఏ ఆర్‌ మురుగదాస్‌    బి) లింగుస్వామి
సి) ఏ.ఎల్‌. విజయ్‌           డి) విఘ్నేశ్‌ శివన్‌

17 శ్రీదేవి కూతురు జాహ్నవి. ఆమె నటించిన మొదటి సినిమా ‘ధడక్‌’ నటిగా మంచి మార్కులు తెచ్చిపెట్టింది. ఆమె ఇప్పుడు చేస్తున్న సినిమాలో ఏ పాత్ర పోషిస్తున్నారో తెలుసా?
ఎ) బాక్సర్‌  బి) పైలెట్‌  సి) షూటర్‌  డి) క్రికెటర్‌

18 ప్రస్తుతం ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ సరసన నటిస్తున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా? (ఆమె తండ్రి ప్రముఖ హిందీ దర్శకుడు)
ఎ) కరీనా కపూర్‌      బి) కరిష్మా కపూర్‌  
సి) ఆలియా భట్‌       డి) సోనమ్‌ కపూర్‌

19 1970 – 80ల మధ్య కాలంలో తమిళ్‌ హీరోల్లో మంచి పేరున్న నటుడు ఆనంద్‌. ఆయన కుమార్తె తెలుగు సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌కు పెట్టింది పేరు. ఆమె భర్త కూడా నటుడే. ఎవరామె?
ఎ) సిల్క్‌ స్మిత     బి) అభినయ శ్రీ
సి) అనురాధ      డి) డిస్కో శాంతి

20 ఈ మధ్యే విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘118’. ఆ చిత్రంలో నివేదా థామస్‌ చిన్నప్పటి పాత్రలో నటించిన బాల నటి పేరు పాట. ఆ పాప ఓ ప్రముఖ తెలుగు నటుని కుమార్తె. ఎవరా నటుడు?
ఎ) ఉత్తేజ్‌   బి) రాజీవ్‌ కనకాల
సి) సమీర్‌   డి) రఘుబాబు

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) (బి)  2) (బి)  3) (సి)  4) (సి)  5) (బి)  6) (ఎ)  7) (సి)   8) (ఎ)  9) (డి)  10) (బి) 
11) (సి)  12) (సి)  13) (ఎ)   14) (సి)  15) (సి)  16) (డి)  17) (బి)  18) (సి)  19) (డి)  20) (ఎ)

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top