సూర్యకు అభినందనల వెల్లువ | tollywood, kolywood heroes congratulate hero suriya | Sakshi
Sakshi News home page

సూర్యకు అభినందనల వెల్లువ

May 6 2016 6:44 PM | Updated on Aug 28 2018 4:30 PM

సూర్యకు అభినందనల వెల్లువ - Sakshi

సూర్యకు అభినందనల వెల్లువ

విభిన్న కథాంశంతో వెండితెర మీదకు వచ్చిన 24 హీరో సూర్యను పలువురు టాలీవుడ్, కోలీవుడ్ హీరోలు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

విభిన్న కథాంశంతో వెండితెర మీదకు వచ్చిన 24 హీరో సూర్యను పలువురు టాలీవుడ్, కోలీవుడ్ హీరోలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. సినిమాలో ట్విస్టులు అదిరిపోయాయని, కథాంశం కూడా చాలా బాగుందని చెబుతున్నారు. మంచి ఓపెనింగ్ కూడా వచ్చిందని మెచ్చుకుంటున్నారు. తాను ఈ సినిమాను ఎంతగానో లవ్ చేశానని, ముఖ్యంగా చివరి 20 నిమిషాలు అదిరిపోయిందని టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ అన్నాడు. విజువల్స్, ట్విస్టులు, సూర్య నటన చాలా బాగున్నాయని, ఈ సినిమాను తప్పనిసరిగా చూడాల్సిందేనని ట్వీట్ చేశాడు.

ఇక 'అ.. ఆ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న హీరో నితిన్ కూడా ఈ సినిమాపై స్పందించాడు. ముందుగా టీమ్ 24కు కంగ్రాట్స్ చెప్పాడు. సినిమా గురించి చాలా అద్భుతాలు వింటున్నానని, ఈ మాస్టర్ పీస్‌తో శ్రేష్ట్ మూవీస్‌కు కూడా అనుబంధం ఉన్నందుకు సంతోషంగా ఉందని అన్నాడు. దర్శకుడు విక్రమ్‌కు, హీరో సూర్యకు థాంక్స్ చెప్పాడు. ఇక ఈ సినిమాకు రాక్‌స్టార్ ఓపెనింగ్ వచ్చిందని, ఆల్ ద బెస్ట్ అని కోలీవుడ్ హీరో మాధవన్ అన్నాడు. ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని కూడా చెప్పాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement