నేడు మనోజ్, ప్రణతి నిశ్చితార్థం | Today Manchu Manoj-Pranathi Engagement Ceremony | Sakshi
Sakshi News home page

నేడు మనోజ్, ప్రణతి నిశ్చితార్థం

Mar 4 2015 8:02 AM | Updated on Oct 8 2018 7:35 PM

నేడు మనోజ్, ప్రణతి నిశ్చితార్థం - Sakshi

నేడు మనోజ్, ప్రణతి నిశ్చితార్థం

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత డాక్టర్ ఎం. మోహన్‌బాబు చిన్న కుమారుడు, హీరో మంచు మనోజ్ నిశ్చితార్థం నేడు ప్రణతిరెడ్డితో జరగనుంది.

హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు, నిర్మాత డాక్టర్ ఎం. మోహన్‌బాబు చిన్న కుమారుడు, హీరో మంచు మనోజ్ నిశ్చితార్థం నేడు ప్రణతిరెడ్డితో జరగనుంది. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని పార్క్ హయత్ హోటల్‌లో ఉదయం 10.30 గంటలకు  ఈ వేడుక  నిర్వహించనున్నారు. ఇందుకోసం మోహన్‌బాబు కుటుంబం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడుతో పాటు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా హాజరు కానున్నట్టు సమాచారం. కాగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రానుండటంతో మంగళవారం హోటల్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.


తమ కుటుంబంలోకి రాబోయే 'ప్రణతిరెడ్డి' తనకు మూడో కూతురు అని హీరో మోహన్ బాబు ట్విట్ చేసిన విషయం తెలిసిందే. మంచు లక్ష్మి, విరానికాలాగా తనకు ఆమె మరో కుమార్తెగా ఆయన అన్నారు.

తన స్నేహితురాలు ప్రణతిరెడ్డితో మనోజ్కు పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్థ వేడుకను తెలుగు సంప్రదాయ పద్ధతుల్లోనే చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. మొదట మనోజ్ ఇంట్లో పూజ నిర్వహిస్తారు. తరువాత హోటల్లో ఉంగరాలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రణతి రెడ్డి బిట్స్ పిలానిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అంతేకాకుండా మంచు విష్ణు భార్య విరానికాకు క్లాస్మేట్ అనే విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement