బాహుబలి 2 రికార్డ్‌ బ్రేక్‌ చేసిన సల్మాన్‌ | Tiger Zinda Hai trailer Breaks Baahubali 2 record | Sakshi
Sakshi News home page

బాహుబలి 2 రికార్డ్‌ బ్రేక్‌ చేసిన సల్మాన్‌

Nov 11 2017 12:32 PM | Updated on Nov 11 2017 1:25 PM

Tiger Zinda Hai trailer Breaks Baahubali 2 record - Sakshi

ఇటీవల వరుస ఫ్లాప్‌ లతో ఇబ్బందుల్లో పడ్డ బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టైగర్‌ జిందాహై. గతంలో ఘనవిజయం సాధించిన ఏక్తా టైగర్‌ కు సీక్వల్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిస్టమస్‌ కానుకగా డిసెంబర్‌ నెలాఖరున రిలీజ్‌ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ ట్రైలర్‌ గత చిత్రాల డిజిటల్‌ రికార్డులన్నింటినీ చెరిపేస్తూ దూసుకుపోతోంది. తాజాగా యూట్యూబ్‌లో అత్యధిక లైక్‌లు సాధించిన భారతీయ చిత్ర ట్రైలర్‌గా రికార్డ్‌ సృష్టించింది టైగర్‌ జిందాహై.

గతంలో ఐదున్నర లక్షల లైకులతో బాహుబలి 2 ట్రైలర్‌ పేరిట ఉన్న రికార్డ్‌ను 7 లక్షలకు పైగా లైకులతో టైగర్‌ జిందాహై ట్రైలర్‌ బ్రేక్‌ చేసింది. అంతేకాదు ఇప్పటికే మూడు కోట్ల వ్యూస్‌కు చేరువలో ఉన్న ఈ ట్రైలర్‌, త్వరలో అత్యధిక వ్యూస్‌ సాదించిన ట్రైలర్‌గా కూడా రికార్డ్‌ సృష్టింస్తుందని భావిస్తున్నారు. సల్మాన్‌ సరసన కత్రినా కైఫ్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాకు అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకుడు, యష్‌ రాజ్‌ ఫిలింస్‌ సంస్థ భారీ బడ్జెట్‌ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ట్రైలర్‌ల లిస్ట్‌ లో బాహుబలి, ట్రైగర్‌ జిందాహైలు ముందున్నా.. తమిళ సినిమా ‘మెర్సల్‌’ టీజర్‌ 10లక్షలకు పైగా లైకులు సాదదించి ఎవరికీ అందని స్థాయిలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement