రిలీజ్‌ కాకముందే సీక్వెల్‌! | Tiger Shroff Baaghi 3 Announced | Sakshi
Sakshi News home page

Feb 19 2018 12:16 PM | Updated on Feb 19 2018 12:16 PM

Tiger Shroff Baaghi 3 Announced - Sakshi

బాఘీ-2 పోస్టర్‌

సాక్షి, సినిమా : బాలీవుడ్‌లో మరో సీక్వెల్‌ చిత్రాన్ని ప్రకటించేశారు. భాఘీ నుంచి మరో చిత్రం రాబోతున్నట్లు అనౌన్స్‌ చేశారు. సిరీస్‌లో రెండో చిత్రం విడుదల కాకముందే మూడో దానిని ప్రకటించటం విశేషం.

టైగ‌ర్ ష్రాఫ్ హీరోగానే బాఘీ 3 సినిమా ఉండబోతున్నట్లు చెప్పేశారు.  నిర్మాత సాజిద్‌ నడియా వాలా సొంత బ్యానర్‌ లోనే ఈ చిత్రం కూడా తెరకెక్కబోతోంది. బాఘీ 2 తెరకెక్కిస్తున్న అహ్మద్‌ ఖాన్‌ మూడో పార్ట్‌ను డీల్‌ చేయబోతున్నాడు. మిగతా తారాగణం త్వరలో ప్రకటించనున్నారు.

బాఘీ మొదటి పార్ట్‌ తెలుగు వర్షం చిత్రం రీమేక్‌గా తెరకెక్కింది. సబ్బీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించగా.. శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌ గా నటించింది. రెండో పార్ట్‌ను క్షణం రీమేక్‌గా అహ్మద్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్నాడు. దిశా పఠానీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. క్లాసిక్‌ మూవీ బేతాబ్ లో మాధురి సాంగ్‌ ‘ఏక్ దో తీన్’ పాట రీమిక్స్‌పై జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చిందులు వేయనుంది. మార్చి 30న బాఘీ-2 విడుదల కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement