టైగర్‌.. టాక్సీవాలా | Tiger Shroff And Vijay Devarakonda in Hyderabad Shopping Malls | Sakshi
Sakshi News home page

టైగర్‌.. టాక్సీవాలా

Nov 16 2018 11:25 AM | Updated on Nov 20 2018 12:45 PM

Tiger Shroff And Vijay Devarakonda in Hyderabad Shopping Malls - Sakshi

బాలీవుడ్‌ ఫైటింగ్‌ స్టార్‌ టైగర్‌ ష్రాఫ్‌ గురువారం నగరంలో సందడి చేశాడు. కొత్తగూడలో ఏర్పాటు చేసిన లైఫ్‌స్టైల్‌ స్టోర్‌ను ప్రారంభించి అభిమానులనుఅలరించాడు.టాలీవుడ్‌ హీరో విజయ్‌దేవరకొండ బంజారాహిల్స్‌లో మెరిశాడు. కొత్తగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్యాషన్‌ డిజైనర్‌ స్టోర్‌ను ప్రారంభించాడు.

జూబ్లీహిల్స్‌  :ఫ్యాషన్‌ డిజైనర్‌ దంపతులు రామ్‌–చంద్రికలు బంజారాహిల్స్‌ రోడ్‌నంబర్‌ 10లో  ఏర్పాటు చేసిన ‘ రామ్జ్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ స్టోర్‌ ’ను సినీహీరో విజయ్‌ దేవరకొండ ప్రారంభించారు. రామ్‌ దంపతులు తయా రు చేసిన డిజైన్‌ చేసిన దుస్తులు తనకెంతో ఇష్ట్రమన్నారు. రామ్‌ దంపతులు మాట్లాడుతూ ప్రఖ్యాత లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో తమ కలెక్షన్లు ప్రదర్శించామన్నారు. ఈ స్టోర్‌లో  ప్రత్యేకించి పురుషుల డిజైన్లు అంది స్తున్నాని వారు చెప్పారు.

కొత్తగూడలో ‘లైఫ్‌స్టైల్‌’ స్టోర్‌ ప్రారంభం
రాయదుర్గం: ఫ్యాషన్‌కు ప్రియులకు ఎంతో ఇష్టమైన ‘లైఫ్‌ స్టైల్‌’ స్టోర్‌ కొత్తగూడ కూడలిలోని శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌లో అందుబాటులోకి వచ్చింది. దీనిని గురువారం అభిమానుల కోలాహలం మధ్య బాలీవుడ్‌ స్టార్‌ టైగర్‌ ష్రాఫ్, లైఫ్‌స్టైయిల్‌ ఎండీ వసంత్‌ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం టైగర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ సిటీ తనకెంతో ఇష్టమని, తనకు ఇక్కడ చాలామంది అభిమానులు ఉన్నారన్నాడు. హైదరాబాద్‌లో బిర్యానీ, కబాబ్‌ ఇష్టమన్నాడు. తెలుగు హీరో అల్లు అర్జున్‌ అంటే ప్రత్యేకమైన అభిమానంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా అభిమానుల కోరిక మేరకు గాల్లోకి ఎగిరి ఓ స్టంట్‌ చేసి అలరించాడు. సంస్థ ఎండీ వసంత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. 20 ఏళ్లలో దేశవ్యాప్తంగా 75 స్టోర్స్‌ను ప్రారంభించామన్నారు. నగరంలో వినియోగదారుల నుంచి వస్తున్న ఆదరణతో మూడో స్టోర్‌ను శరత్‌సిటీ క్యాపిటల్‌ మాల్‌లో అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలో మరో స్టోర్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement