2.0 ఎఫెక్ట్‌! | Tiger Shroff, Ananya Panday, Tara Sutaria starrer Student Of The Year 2 to now release on this date | Sakshi
Sakshi News home page

2.0 ఎఫెక్ట్‌!

Aug 3 2018 2:35 AM | Updated on Nov 9 2018 4:32 PM

Tiger Shroff, Ananya Panday, Tara Sutaria starrer Student Of The Year 2 to now release on this date - Sakshi

అనన్య, టైగర్‌ ష్రాఫ్, తార

పునీత్‌ మల్హోత్రా దర్శకత్వంలో టైగర్‌ ష్రాఫ్, తారా సుతారియా, అనన్యా పాండే ముఖ్య తారలుగా కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’. దాదాపు ఆరేళ్ల క్రితం కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ చిత్రానికి సీక్వెల్‌ ఇది. తొలుత ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ను ఈ ఏడాది నవంబర్‌ 23న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న రిలీజ్‌ చేయనున్నట్లు కరణ్‌ జోహార్‌ వెల్లడించారు. అంతేకాదు.. తొలి పార్ట్‌లో నటించిన సిద్ధార్థ్‌ మల్హోత్రా, ఆలియా భట్, వరుణ్‌ ధావన్‌ ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ సినిమాలోని ఓ స్పెషల్‌ సాంగ్‌లో గెస్ట్‌ రోల్స్‌ చేయనున్నారని టాక్‌. శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌ కుమార్, అమీ జాక్సన్‌ నటించిన ‘2.0’ చిత్రం నవంబర్‌ 29న రిలీజ్‌ కానుండటమే ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ సినిమా వాయిదా పడటానికి కారణం అని బీ టౌన్‌ టాక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement