అమ్మమ్మ మీద ఒట్టు | 'Thugs of Hindostan' Trailer Releases On This Date | Sakshi
Sakshi News home page

అమ్మమ్మ మీద ఒట్టు

Sep 25 2018 4:24 AM | Updated on Sep 25 2018 4:24 AM

'Thugs of Hindostan' Trailer Releases On This Date - Sakshi

ఆమిర్‌ఖాన్

‘‘నా పేరే ఫిరంగీ మల్హా. నా వంటి నిజాయతీ పరుడు ఈ భూ ప్రపంచం మీద ఎక్కడా దొరకడు. నిజం నా రెండో పేరు. నిజాయతీ నా పని తీరు. మా అమ్మమ్మ మీద ఒట్టు’’ అని తన పాత్ర విశేషాలు పంచుకున్నారు ఆమిర్‌ ఖాన్‌. విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్, అమితాబ్‌ బచ్చన్, కత్రినా కైఫ్‌ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందోస్తాన్‌’.  ఈ చిత్రంలోని ప్రతీ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఒక్కొక్కటిగా రిలీజ్‌ చేస్తున్నారు చిత్రబృందం. సోమవారం ఆమిర్‌ ఖాన్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. గాడిద మీద కూర్చొని, పచ్చని జాకెట్, ఎర్రటి కళ్లజోడు, టోపీతో విచిత్రమైన వేషధారణలో ఫిరంగీ పాత్రలో కనిపించనున్నారు ఆమిర్‌. ఈ చిత్రం ట్రైలర్‌ ఈ నెల 27న,  సినిమా నవంబర్‌ 8న రిలీజ్‌ కానున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement