మహేష్ కోసం ముగ్గురు స్టంట్ మాస్టర్లు | three stunt Masters for mahesh babu murugadoss movie | Sakshi
Sakshi News home page

మహేష్ కోసం ముగ్గురు స్టంట్ మాస్టర్లు

Oct 27 2016 3:41 PM | Updated on Sep 4 2017 6:29 PM

మహేష్ కోసం ముగ్గురు స్టంట్ మాస్టర్లు

మహేష్ కోసం ముగ్గురు స్టంట్ మాస్టర్లు

మహేష్ బాబు, మురుగదాస్ల కాంబినేషన్లో రూపొందుతున్న కొత్త సినిమాకు సంబందించి రోజుకో వార్త అభిమానులను ఖుషీ చేస్తోంది. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను...

మహేష్ బాబు, మురుగదాస్ల కాంబినేషన్లో రూపొందుతున్న కొత్త సినిమాకు సంబందించి రోజుకో వార్త అభిమానులను ఖుషీ చేస్తోంది. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫైట్ సీన్స్ను కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే దేశంలోనే టాప్ స్టంట్ మాస్టర్లతో యాక్షన్స్ సీన్స్ను డైరెక్ట్ చేయిస్తున్నారు.

మహేష్ బాబు రా ఏజెంట్గా నటిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే అనల్ అరసు, పీటర్ హెయిన్స్ లాంటి టాప్ ఫైట్ మాస్టర్లు పనిచేస్తున్నారు. తాజాగా వీరితో పాటు మరో స్టంట్ మాస్టర్ కూడా మహేష్ మూవీ టీంలో జాయిన్ అయ్యాడు. జయహో, రాజ్ కుమార్, అఖిల్ లాంటి సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫి చేసిన రవి వర్మ మహేష్ మూవీ కోసం పని చేస్తున్నాడు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా 2017 ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement