అవి నాకు సూపర్‌ స్పెషల్‌ | Those Birthmarks Are So Special For Me Says Shruti Hassan | Sakshi
Sakshi News home page

అవి నాకు సూపర్‌ స్పెషల్‌

Jun 29 2020 12:36 AM | Updated on Jun 29 2020 4:44 AM

Those Birthmarks Are So Special For Me Says Shruti Hassan - Sakshi

‘‘నిన్ను నిన్నులా ఉంచే నీలోని ప్రతి విషయం ప్రత్యేకమైనదే’’ అని అంటున్నారు శ్రుతీహాసన్‌. సెల్ఫ్‌లవ్‌ (మనల్ని మనం ఇష్టపడటం) గురించి శ్రుతీహాసన్‌ మాట్లాడుతూ – ‘‘మనం ఎలా ఉన్నామో అలా మనల్ని మనం స్వీకరించుకోవాలి. నా కళ్లను గమనిస్తే నల్లని మచ్చలు కనబడతాయి. అవును.. నా కళ్లలో పుట్టుమచ్చలు ఉన్నాయి. దానికి నేనేం బాధపడటంలేదు. ఇది జబ్బు కూడా కాదు. ఆ మచ్చలు నా కళ్లలో ఎప్పటినుంచో ఉన్నాయి. అవి నాకు సూపర్‌ స్పెషల్‌. మనల్ని మనలా గుర్తించే ప్రతి అంశం మనకు గొప్పదే’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్‌. అలాగే తన కంటిలో ఉన్న పుట్టుమచ్చలు కనిపించేలా ఓ ఫొటోను షేర్‌ చేశారామె. ఇక సినిమాల విషయానికి వస్తే... తెలుగులో రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్‌’, తమిళంలో విజయ్‌సేతుపతి నటిస్తున్న ‘లాభం’ చిత్రాల్లో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement