ఫోనులో ఎవరో? ఏంటో?! | tholiprema film is currently being shoting in London | Sakshi
Sakshi News home page

ఫోనులో ఎవరో? ఏంటో?!

Oct 3 2017 12:27 AM | Updated on Oct 3 2017 3:16 AM

tholiprema  film is currently being shoting in London

చూశారా? శీతాకాలం గాలులకు నా హెయిర్‌ క్లియర్‌గా కంట్రోల్‌ తప్పింది. కానీ, వరుణ్‌తేజ్‌ హాయిగా నవ్వుతూ ఫోన్‌ చూసుకుంటున్నాడు. (ఫోనులో) ఎవరో? ఏంటో?... ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో అభిమానులందర్నీ అడిగారు రాశీ ఖన్నా. వరుణ్‌తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న సినిమా ‘తొలిప్రేమ’.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది. అక్కడ రాశీ తీసుకున్న సెల్ఫీనే మీరు చూస్తున్నది. అన్నట్టు... ఓ విషయం గమనించారా? వరుణ్‌తేజ్‌ హెయిర్‌ స్టైల్‌ కొంచెం కొత్తగా ఉంది. ‘తొలిప్రేమ’లో లుక్‌ ఇదేనని కొత్తగా చెప్పక్కర్లేదు కదూ!!

Advertisement
 
Advertisement
Advertisement