కుమ్మేస్తున్నాడు | tholi prema shooting hyderabad | Sakshi
Sakshi News home page

కుమ్మేస్తున్నాడు

Dec 27 2017 12:09 AM | Updated on Dec 27 2017 12:09 AM

tholi prema shooting hyderabad - Sakshi

అకౌంట్స్‌ మేటర్‌లో ఏదైనా తేడా వస్తే ఎవరైనా ఊరుకుంటారా? లెక్కలు సరి చేస్తారు. అవసరమైతే తేడా చేసినవాళ్ల తాట తీస్తారు. ప్రజెంట్‌ హీరో వరుణ్‌ తేజ్‌ అదే పనిలో ఉన్నారు. తన లవ్‌ అకౌంట్‌ను ఇబ్బందిపెట్టిన కొందరి పోరగాళ్లను కుమ్మేస్తున్నాడు. మరి... ఈ లవ్‌ అకౌంట్‌ ఫుల్‌ డీటెల్స్‌ తెలియాలంటే మా సినిమా చూడాల్సిందేనని అంటున్నారు ‘తొలిప్రేమ’ చిత్రబృందం.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా ‘తొలిప్రేమ’. రాశీఖన్నా కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమాలోని ఫైట్‌ సీన్స్‌ను హైదరాబాద్‌లోని ఓ కాలేజ్‌ క్యాంపస్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి అలా ఉంచితే... అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మల్టీస్టారర్‌ మూవీలో వెంకటేశ్‌తో కలిసి వరుణ్‌ తేజ్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారని ఫిల్మ్‌నగర్‌ తాజా సమాచారం. గతంలో ఈ సినిమాకు ‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ అనే టైటిల్‌ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement