బాబాయ్‌ టైటిల్‌తో అబ్బాయ్‌ | Tholi Prema likely to be title of Varun Tej's next | Sakshi
Sakshi News home page

పవన్‌ టైటిల్‌తో వరుణ్‌

Dec 4 2017 4:34 PM | Updated on Mar 22 2019 5:33 PM

Tholi Prema likely to be title of Varun Tej's next - Sakshi

గతంలో హిట్‌ అయిన పాటలను రీమేక్‌ చేయడం చూశాం. అది ఇప్పుడు కాస్తా సినిమా పేర్లపై పడింది. గతంలో బ్లాక్‌బస్టర్ల పేర్లను మళ్లీ తెరపై వాడేస్తున్నారు. అదే కోవలో వరుణ్‌ తేజ్‌ చేరాడు. ఫిదాతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టిన వరుణ్‌ తన తర్వాత చిత్రానికి చాలా విరామం తీసుకున్నాడు. ఆ గ్యాప్‌ను పూరించడానికి బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమా తొలిప్రేమ టైటిల్‌ను తన తాజా సినిమాకు పెట్టుకున్నాడు. తొలిప్రేమ పవన్‌కల్యాణ్‌ కేరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం. కరుణాకరన్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌, కీర్తిరెడ్డి నటించిన ఈ చిత్రం యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పట్లో ఓ ట్రెండ్‌ సృష్టించింది.

ఫిదాతో హిట్‌ కొట్టిన వరుణ్‌, మరో బ్లాక్‌బస్టర్‌ కొట్టాలనే ఉద్దేశంతో ఉన్నాడు. దీంతో  బాబాయ్‌ టైటిల్‌ను తన తాజా చిత్రానికి టైటిల్‌గా పెట్టుకున్నాడు. ఈమేరకు సినిమా టైటిల్‌ పోస్టర్‌ను వరుణ్‌ తేజ్‌ సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించనున్నారు. తమన్‌ సంగీతాన్ని అందించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement