గోపీచంద్ ఈసారి బాగా నవ్విస్తాడు | This movie is very funny | Sakshi
Sakshi News home page

గోపీచంద్ ఈసారి బాగా నవ్విస్తాడు

Apr 11 2014 11:29 PM | Updated on Sep 2 2017 5:54 AM

గోపీచంద్ ఈసారి బాగా నవ్విస్తాడు

గోపీచంద్ ఈసారి బాగా నవ్విస్తాడు

‘‘సాధారణంగా గోపీచంద్ సినిమా అనగానే యాక్షన్ ఎక్కువ ఆశిస్తారు. కానీ మా సినిమాలో పూర్తి స్థాయిలో వినోదం కురిపిస్తాడు. ప్రతి సీన్‌లోనూ బాగా నవ్విస్తాడు’’ అని దర్శకుడు శ్రీవాస్ చెప్పారు.

‘‘సాధారణంగా గోపీచంద్ సినిమా అనగానే యాక్షన్ ఎక్కువ ఆశిస్తారు. కానీ మా సినిమాలో పూర్తి స్థాయిలో వినోదం కురిపిస్తాడు. ప్రతి సీన్‌లోనూ బాగా నవ్విస్తాడు’’ అని దర్శకుడు శ్రీవాస్ చెప్పారు. గోపీచంద్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆనంద్‌ప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా, రచయిత శ్రీధర్ సీపాన క్లాప్ ఇచ్చారు.
 
గోపీచంద్ మాట్లాడుతూ -‘‘భవ్య నాకు సొంత సంస్థ లాంటిది. ‘లక్ష్యం’ తర్వాత శ్రీవాస్‌తో మళ్లీ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. హీరోయిజం ఉంటూనే నా పాత్ర అందర్నీ వినోదపరుస్తుంది’’ అన్నారు. శ్రీధర్ సీపాన మాట్లాడుతూ -‘‘మేగ్జిమమ్ మైండ్ వాడతాడు. అవసరమైనప్పుడు హ్యాండ్ వాడతాడు అని ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. ఇదే ఈ సినిమా హీరో పాత్ర చిత్రణ’’ అని చెప్పారు.
 
 ఈ నెల 18 నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలుపెడతామని, ఆగస్టు కల్లా షూటింగ్ పూర్తవుతుందని నిర్మాత తెలిపారు. రకుల్ ప్రీత్‌సింగ్, గోపీమోహన్, వెట్రి తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కథ-మాటలు: శ్రీధర్ సీపాన.

Advertisement
 
Advertisement
Advertisement