
అజార్ కు ఇమ్రాన్ హష్మి స్పెషల్ గిఫ్ట్
బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి.. భారత మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కు మరపురాని పుట్టినరోజు కానుకను అందించారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి.. భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు మరపురాని పుట్టినరోజు కానుకను అందించారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో లీడ్ రోల్లో నటిస్తున్న ఇమ్రాన్.. సోమవారం 53వ పడిలో అడుగుపెట్టిన అజారుద్దీన్కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ లో ఓ స్పెషల్ ఫొటోను పోస్ట్ చేశారు.
ఆ ఫొటోలో తెలుపు రంగు టెస్ట్ టీమ్ జెర్సీని ధరించి కనబడుతున్న ఇమ్రాన్.. వయస్సులో ఉన్నప్పటి అజహర్ను ప్రతిబింబిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఇమ్రాన్ క్రికెట్లో మెళకువలు నేర్చుకున్నాడు. ముఖ్యంగా అజారుద్దీన్ బ్యాటింగ్ శైలి బాగా ప్రాక్టీస్ చేశాడు. ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ మాట్లాడుతూ.. ఈ సినిమా నటుడిగా ఇమ్రాన్ను మరోసారి తనను తాను కనుగొనేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు. టోనీ డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వేసవిలో విడుదల కానుంది.
Happy 53rd Birthday @mpazhar. Here is my birthday present.Me as You in #Azhar! #HappyBirthdayAzhar @AzharTheFilm pic.twitter.com/0LWBie2GmT
— emraan hashmi (@emraanhashmi) February 8, 2016