సుకుమారి 21... లవ్‌స్టోరీ | This is a distinct love story | Sakshi
Sakshi News home page

సుకుమారి 21... లవ్‌స్టోరీ

Sep 28 2015 11:55 PM | Updated on Sep 3 2017 10:08 AM

సుకుమారి 21... లవ్‌స్టోరీ

సుకుమారి 21... లవ్‌స్టోరీ

స్టార్ డెరైక్టర్ సుకుమార్ తొలిసారి కథ, స్క్రీన్‌ప్లే అందించి, తొలి ప్రయత్నంగా నిర్మించిన చిత్రం ‘కుమారి 21 ఎఫ్’. రాజ్‌తరుణ్, హేభా ......

స్టార్ డెరైక్టర్ సుకుమార్ తొలిసారి కథ, స్క్రీన్‌ప్లే అందించి, తొలి ప్రయత్నంగా నిర్మించిన చిత్రం ‘కుమారి 21 ఎఫ్’. రాజ్‌తరుణ్, హేభా పటేల్ జంటగా సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సుకుమార్ మాట్లాడుతూ- ‘‘ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం.

యూత్‌తో పాటు అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే అంశాలుంటాయి. రత్నవేలు ఫొటోగ్రపీ, దేవిశ్రీ ప్రసాద్‌ల సంగీతం ఈ చిత్రానికి హైలైట్’’ అని చెప్పారు. ‘‘సుకుమార్ మార్క్‌లో సాగే అందమైన ప్రేమకథ ఇది. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. అక్టోబర్‌లో పాటలను, అదే నెల 30న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటర్: అమర్‌రెడ్డి, ఆర్ట్: బి.రామచంద్రసింగ్.
 

Advertisement
 
Advertisement
Advertisement