బాలీవుడ్‌పై ఆశ లేదు | There is no hope on bollywood | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌పై ఆశ లేదు

Apr 12 2014 1:12 AM | Updated on Apr 3 2019 6:23 PM

బాలీవుడ్‌పై   ఆశ లేదు - Sakshi

బాలీవుడ్‌పై ఆశ లేదు

నటి అనుష్క విషయానికొస్తే ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్. అలాంటి బ్యూటీ తనకు బాలీవుడ్ ఆశ లేదంటున్నారు.

కోరికలకు కళ్లెం వేయడం కష్టం అంటుంటారు సినిమా రంగంలో అయితే ఆశలకు అంతే ఉండదు ముఖ్యంగా హీరోయిన్లలో ఈ లక్షణాలు అధికంగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే హీరోయిన్లుగా వారి వ్యవధి పరిమితం.

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా మార్కెట్ ఉండగానే సంపాదించుకోవాలనుకుంటారు. దీంతో దక్షిణాదిలో పాపులర్ అయిన వెంటనే బాలీవుడ్‌పై మోహం పెరుగుతుంటుంది. అయితే అందరూ అలా ఆశిస్తారని చెప్పలేం.
 
 నటి అనుష్క విషయానికొస్తే ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్. అలాంటి బ్యూటీ తనకు బాలీవుడ్ ఆశ లేదంటున్నారు. తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దు గుమ్మ జగ్గు దాదా అనే చిత్రంలో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ తాను పుట్టింది కర్ణాటకలోని మంగుళూర్‌లో అయినా మాతృభాషలో నటించే అవకాశం రాలేదనే చిన్న ఫీలింగ్ ఇప్పటి వరకు ఉండేదన్నారు. అది ఈ జగ్గుదాదా చిత్రంతో పోయిందని తెలిపారు.
 
 తెలుగు, తమిళం ఇప్పుడు కన్నడం తదుపరి బాలీవుడ్ రంగ ప్రవేశమేనా? అన్న ప్రశ్నకు అలాంటిదేమి లేదని అనుష్క బదులిచ్చారు. ఇంకా ఆమె మాట్లాడుతూ తనకు సంబంధించినంత వరకు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించడమే సంతృప్తిగా ఉందన్నారు. హిందీ చిత్రాల్లో నటించాలనే ఆశ ఎప్పుడూ కలగలేదని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement