కండల వీరుడి కళాపోషణ! | The muzzle of the art nutrition! | Sakshi
Sakshi News home page

కండల వీరుడి కళాపోషణ!

Jun 17 2015 11:24 PM | Updated on Sep 3 2017 3:53 AM

కండల వీరుడి కళాపోషణ!

కండల వీరుడి కళాపోషణ!

కండల వీరుడు సల్మాన్ ఖాన్‌లో మంచి నటుడే కాదు.. మంచి చిత్రకారుడూ ఉన్నాడు. వీలు చిక్కినప్పుడల్లా కుంచె చేతబట్టి తనకు నచ్చిన బొమ్మలు గీస్తుంటారు.

కండల వీరుడు సల్మాన్ ఖాన్‌లో మంచి నటుడే కాదు.. మంచి చిత్రకారుడూ ఉన్నాడు. వీలు చిక్కినప్పుడల్లా కుంచె చేతబట్టి తనకు నచ్చిన బొమ్మలు గీస్తుంటారు. తాజాగా, ఆయన ఓ బొమ్మ గీశారు. ప్రేమ మైకంలో ఉన్న అందమైన జంట బొమ్మ అది.
 
 ఇప్పుడు సల్మాన్ ఆ బొమ్మ గీయడానికి కారణం లేకపోలేదు. కరీనాకపూర్‌తో కలిసి ఆయన నటించిన ‘భజరంగీ భాయ్‌జాన్’ త్వరలో విడుదల కానుంది. ఇందులో సల్మాన్, కరీనా మధ్య అందమైన లవ్‌స్టోరీ ఉంది.
 
 దాన్ని ఉద్దేశించి ఈ బొమ్మకు ‘భజరంగీ భాయ్‌జాన్’ అని పేరు పెట్టి, ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ బొమ్మను చూసినవాళ్లు ‘సల్మాన్ ఎంత మంచి చిత్రకారుడో’ అని అభినందించకుండా ఉండలేకపోయారు.
 

Advertisement
 
Advertisement
Advertisement