అప్పుడు మలేసియా... ఇప్పుడు దుబాయ్‌! | The '2.0' audio was announced by the production company in Dubai. | Sakshi
Sakshi News home page

అప్పుడు మలేసియా... ఇప్పుడు దుబాయ్‌!

Jun 22 2017 12:09 AM | Updated on Sep 5 2017 2:08 PM

అప్పుడు మలేసియా... ఇప్పుడు దుబాయ్‌!

అప్పుడు మలేసియా... ఇప్పుడు దుబాయ్‌!

రజనీకాంత్‌ ‘రోబో’ (తమిళంలో ‘ఎందిరన్‌’) ఆడియో వేడుక ఎక్కడ జరిగిందో గుర్తుందా? మలేసియాలో! ఇంటర్నేషనల్‌ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్‌ చేయాలనే ఉద్దేశంతో అప్పట్లో దర్శకుడు శంకర్‌ ‘ఎందిరన్‌’ ఆడియోను అలా ప్లాన్‌ చేశారు.

రజనీకాంత్‌ ‘రోబో’ (తమిళంలో ‘ఎందిరన్‌’) ఆడియో వేడుక ఎక్కడ జరిగిందో గుర్తుందా? మలేసియాలో! ఇంటర్నేషనల్‌ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్‌ చేయాలనే ఉద్దేశంతో అప్పట్లో దర్శకుడు శంకర్‌ ‘ఎందిరన్‌’ ఆడియోను అలా ప్లాన్‌ చేశారు. ఆ తర్వాత చాలామంది సౌతిండియన్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ విదేశాల్లో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇప్పుడు ‘2.0’ ఆడియోకు కూడా సేమ్‌ ప్లాన్‌ను ఫాలో అవుతున్నారు. దుబాయ్‌లో ఈ సినిమా పాటలను విడుదల చేస్తున్నట్టు చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ప్రకటించింది.

దీపావళి టైమ్‌లో అంటే అక్టోబర్‌లో ఆడియో విడుదల చేయనున్నారు. ‘త్రీడీ దివాలి’ పేరుతో రూ. 25 కోట్ల ఖర్చుతో ఈ వేడుక నిర్వహిస్తారని చెన్నై టాక్‌. రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా బోల్డంత మంది అభిమానులున్నారు. దుబాయ్‌ చుట్టుపక్కల దేశాల్లో అభిమానులు ఆడియో వేడుకకు వెళ్లాలని ప్లాన్‌ చేసుకుంటున్నారట! హిందీ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా, అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సిన్మాను త్రీడీలో తెరకెక్కించారు. వచ్చే ఏడాది జనవరి 26న సినిమాను రిలీజ్‌ చేసే నాటికి సౌతిండియన్‌ థియేటర్లలో వీలైనన్ని వాటిని త్రీడీ ప్రొజెక్షన్‌కి అనుగుణంగా కన్వర్ట్‌ చేసే ఆలోచనలో ‘2.0’ టీమ్‌ ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement