ఆ బంధం ఇంటికే పరిమితం | that relation is upto home only | Sakshi
Sakshi News home page

ఆ బంధం ఇంటికే పరిమితం

Mar 14 2015 1:13 AM | Updated on Sep 28 2018 4:53 PM

ఆ బంధం ఇంటికే పరిమితం - Sakshi

ఆ బంధం ఇంటికే పరిమితం

తండ్రి మార్గ దర్శకత్వంలో పిల్లలు అడుగులేయడం అన్నది సాధారణంగా జరిగే విషయమే. తండ్రి దర్శకత్వంలో కూతురు నాయకిగా నటించడమే అరుదైన అంశం.

తండ్రి మార్గ దర్శకత్వంలో పిల్లలు అడుగులేయడం అన్నది సాధారణంగా జరిగే విషయమే. తండ్రి దర్శకత్వంలో కూతురు నాయకిగా నటించడమే అరుదైన అంశం. అలాంటి యాక్షన్ కింగ్ అర్జున్, అందాల భామ ఐశ్వర్య అర్జున్‌ల బంధం గురుశిష్యుల బంధంగా మారనుంది. ఐశ్వర్య అర్జున్ పట్టత్తు యానై చిత్రం ద్వారా కథా నాయకిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం అంచనాలను చేరుకోలేదు. ఇది ఏ పరిచయ నటికి అయినా నిరాశపరిచే విషయమే. అయితే నిరాశ లక్ష్యసాధనకు నిరాటంకం అవుతుంది. అందుకే ఐశ్వర్య మరింత ఆత్మవిశ్వాసంతో మలి ప్రయత్నానికి సిద్ధం అవుతున్నారు.

ఈసారి ఈ బ్యూటీ తన తండ్రి దర్శకత్వంలోనే నటించడానికి రెడీ అవుతుండడం విశేషం. దీని గురించి ఐశ్వర్య అర్జున్ తెలుపుతూ త్వరలో నాన్న దర్శకత్వంలో నటించనున్నాను. అందులో కథక్ నృత్యకారిణి పాత్ర. అందుకే ప్రస్తుతం కథక్ నృత్యం నేర్చుకుంటున్నాను. ఇంతకుముందే నేను మంచి డాన్సర్‌ని. అయితే కథక్ నృత్యంలో పరిచయం లేదు. వేరే దర్శకులైనా ఫర్వాలేదు. నాన్న దర్శకత్వంలో సరిగా నటించకపోతే చీవాట్లు పెడుతారు. అందుకే కథక్‌లో శిక్షణ పొందుతున్నాను. తొలి చిత్రం తరువాత చాలా గ్యాప్ వచ్చిందే అంటున్నారు. మధ్యలో రెండు హిందీ చిత్రాల అవకాశాలు వచ్చినా నిరాకరించాను.

తమిళంలో కూడా మంచి పాత్ర అనిపిస్తేనే నటించాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నాన్న చిత్రానికి నేనే కాస్టూమ్స్ డిజైనర్‌ను. లండన్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చదవడం ఇప్పుడు బాగా ఉపయోగపడుతోంది. నాన్న దర్శకత్వంలో నటించడంలో సౌకర్యం ఎంతో అసౌకర్యం అంతే ఉంటుందన్న విషయం నాకు తెలుసు. అయితే తండ్రీ కూతుళ్ల సంబంధం ఇంటి వరకే పరిమితం. షూటింగ్ స్పాట్‌లో గురుశిష్యుల బంధమే నాన్న చెప్పినట్లు నటించి మంచి నటిగా పేరు తెచ్చుకోవడమే నా ముందున్న లక్ష్యం. ఈ చిత్రంలో హీరో ఎంపిక జరుగుతోంది. నటీనటులందరికి కొంతకాలం శిక్షణ ఇచ్చి ఆ తరువాత షూటింగ్‌కు సిద్ధం అవుతారు నాన్న అని అంటోంది ఐశ్వర్య అర్జున్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement