ఆ నలుగురికి హీరోయిన్ ప్రాబ్లమ్! | That Four heroes Heroine Problem! | Sakshi
Sakshi News home page

ఆ నలుగురికి హీరోయిన్ ప్రాబ్లమ్!

Aug 5 2016 11:48 PM | Updated on Jul 15 2019 9:21 PM

ఆ నలుగురికి హీరోయిన్ ప్రాబ్లమ్! - Sakshi

ఆ నలుగురికి హీరోయిన్ ప్రాబ్లమ్!

పాతికేళ్లు నిండిన ఎవరినైనా టాలీవుడ్‌లో నలుగురు హీరోల పేర్లు చెప్పమంటే వచ్చే సమాధానం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.

పాతికేళ్లు నిండిన ఎవరినైనా టాలీవుడ్‌లో నలుగురు హీరోల పేర్లు చెప్పమంటే వచ్చే సమాధానం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్. మూడు దశాబ్దాలుగా తెలుగు సినిమాపై ముద్ర వేసిన ఈ నలుగురు హీరోలతో సినిమాలు చేయడానికి ఒకప్పుడు హీరోయిన్లు పోటీ పడేవారు. ఒక్క చాన్స్ కోసం వెయ్యికళ్లతో ఎదురు చూసేవారు. సీనియర్ హీరోలుగా ఉన్నప్పుడు కూడా నిండా ఇరవై నిండని అమ్మాయిలు హీరోయిన్లుగా వీళ్లతో ఆడి పాడేవారు. కానీ ఇప్పుడు ఆ నలుగురు హీరోలు సీనియర్స్ కేటగిరీని కూడా దాటిపోయారు. వాళ్ల సినిమాలకు మెగాఫోన్ పట్టడానికి ఇప్పటికీ డెరైక్టర్లు పోటీ పడుతున్నారన్నది నిజమే కానీ... జోడీ కట్టడానికి మాత్రం హీరోయిన్లు కరువైపోతున్నారు.

చిరు, బాలయ్య, నాగ్, వెంకీలతో జతకట్టడానికి యంగ్ హీరోయిన్స్ వెనకడుగు వేస్తున్నారు. ఆ మాటకొస్తే కొత్త హీరోయిన్స్‌ను ఈ సూపర్ సీనియర్లకు మ్యాచ్ చేయడం డెరైక్టర్లకు కూడా ఇబ్బందిగా మారుతోంది. ఈ పరిస్థితిపై పూర్తి కథనం ఈ రోజు మధ్యాహ్నం 12.30 ని.లకు సాక్షి టీవీలో ప్రసారమయ్యే ‘హీరోయిన్ కావలెను’ స్పెషల్ డ్రైవ్‌లో చూడొచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement