ట్యూన్‌ కుదిరింది | Thaman on board for Ravi Teja next | Sakshi
Sakshi News home page

ట్యూన్‌ కుదిరింది

Nov 4 2019 3:46 AM | Updated on Nov 4 2019 3:46 AM

Thaman on board for Ravi Teja next - Sakshi

తమన్‌

కొన్ని కాంబినేషన్లు భలే కుదురుతాయి. అలాంటి వాటిలో హీరో రవితేజ, సంగీత దర్శకుడు తమన్‌ కాంబినేషన్‌ ఒకటి. రవితేజ నటించిన 10 సినిమాలకు సంగీతం అందించారు తమన్‌. తాజాగా మరోసారి ట్యూన్స్‌ సిద్ధం చేయడానికి రెడీ అయ్యారాయన. ‘డాన్‌ శీను, బలుపు’ సినిమాల తర్వాత దర్శకుడు గోపీచంద్‌ మలినేని, హీరో రవితేజ మూడో సినిమా చేస్తున్నారు. ఇందులో రవితేజ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు. శ్రుతీహాసన్‌ హీరోయిన్‌. ‘ఠాగూర్‌’ మధు నిర్మాత. ‘‘ఈ సినిమా మా అందరికీ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అందుకు తగ్గట్టు కష్టపడతాను. రవితేజగారితో నా 11వ సినిమా ఇది. నన్ను నమ్మినందుకు థ్యాంక్స్‌ గోపీచంద్‌ బావా’’ అని ట్వీటర్‌లో పేర్కొన్నారు తమన్‌.

Advertisement
 
Advertisement
Advertisement