ఈ విజయం మధురం! | telugu new movie | Sakshi
Sakshi News home page

ఈ విజయం మధురం!

Jul 16 2015 11:58 PM | Updated on Sep 3 2017 5:37 AM

ఈ విజయం మధురం!

ఈ విజయం మధురం!

ఇప్పటివరకూ చేసిన చిత్రాలు నాకు మంచి పేరు తెచ్చాయి. వాటన్నిటి కన్నా మించిన ఆదరణ ‘సినిమా చూపిస్త మావ’ చిత్రం పాటలకు లభిస్తున్నందుకు

 ‘‘ఇప్పటివరకూ చేసిన చిత్రాలు నాకు మంచి పేరు తెచ్చాయి. వాటన్నిటి కన్నా మించిన ఆదరణ ‘సినిమా చూపిస్త మావ’ చిత్రం పాటలకు లభిస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది’’ అని సంగీతదర్శకుడు శేఖర్ చంద్ర అన్నారు. రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్ (గోపి), రూపేష్ డి.గోవిల్, జి. సునీత నిర్మించిన ‘సినిమా చూపిస్త మావ’ వచ్చే నెల 14న విడుదల కానుంది. ఈ చిత్రం పాటల గురించి శేఖర్ చంద్ర మాట్లాడుతూ- ‘‘కృష్ణంరాజు, సునీల్, కోన వెంకట్ తదితర సినీ ప్రముఖులు పాటలు బాగున్నాయని అభినందించారు. ఆ అభినందనలు ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే ఈ పాటల విజయం నాకు మధురాతి మధురం’’ అని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement