రీమేక్ క్షణంలో పోలీస్! | Telugu movie 'Kshanam' to be remade in Hindi? | Sakshi
Sakshi News home page

రీమేక్ క్షణంలో పోలీస్!

Apr 27 2016 11:12 PM | Updated on Apr 3 2019 6:34 PM

రీమేక్ క్షణంలో పోలీస్! - Sakshi

రీమేక్ క్షణంలో పోలీస్!

‘దృశ్యం’ హిందీ రీమేక్‌లో పోలీస్‌గా నటించిన తబు మరో సారి ఓ సౌత్ రీమేక్‌లో లాఠీ ఝళిపించడానికి సిద్ధమవుతున్నారు.

‘దృశ్యం’ హిందీ రీమేక్‌లో పోలీస్‌గా నటించిన తబు మరో సారి ఓ సౌత్ రీమేక్‌లో లాఠీ ఝళిపించడానికి సిద్ధమవుతున్నారు. చిన్న సినిమాగా వచ్చి, పెద్ద సినిమా రేంజ్‌లో ఆ మధ్య బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు కురిపించిన చిత్రం ‘క్షణం’. సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో నూతన దర్శకుడు రవికాంత్ పేరేపు తెరకెక్కించిన ఈ చిత్రానికి నటుడు అడివి శేష్ కథ-స్క్రీన్‌ప్లే అందించిన విషయం తెలిసిందే.
 
 ఈ సినిమా సాధించిన వసూళ్లు చూసి బాలీవుడ్ కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తెలుగులో అనసూయ పోషించిన నెగటివ్ టచ్ ఉన్న పాత్ర కు హిందీ వెర్షన్‌లో తబును ఖరారు చేశారు దర్శక-నిర్మాతలు. అనసూయ పోషించిన పోలీస్ క్యారెక్టర్‌లో అనేక వేరియేషన్స్ ఉండటంతో ఈ పాత్రకు తబు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. పైగా హిందీలో తబు పోలీస్ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండేలా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అడివి శేష్ పాత్రను సల్మాన్‌ఖాన్ పోషించే అవకాశం ఉందని ఒక వార్త ముంబయ్‌లో షికారు చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement