తెలంగాణ దర్శకుల సంఘం ప్రారంభం | telangana film directors Community Start | Sakshi
Sakshi News home page

తెలంగాణ దర్శకుల సంఘం ప్రారంభం

Sep 22 2013 1:18 AM | Updated on Oct 2 2018 2:54 PM

తెలంగాణ దర్శకుల సంఘం ప్రారంభం - Sakshi

తెలంగాణ దర్శకుల సంఘం ప్రారంభం

చిత్రపరిశ్రమలో తెలంగాణ కళాకారులు వివక్ష ఎదుర్కొంటున్నారు. దాన్ని ప్రశ్నిస్తూనే తెలంగాణ సంస్కృతిని నిలబెట్టుకుంటూ ముందుకు సాగాలన్నదే మా ఆకాంక్ష

 ‘‘చిత్రపరిశ్రమలో తెలంగాణ కళాకారులు వివక్ష ఎదుర్కొంటున్నారు. దాన్ని ప్రశ్నిస్తూనే తెలంగాణ సంస్కృతిని నిలబెట్టుకుంటూ ముందుకు సాగాలన్నదే మా ఆకాంక్ష. ఎలాగూ తెలంగాణ రాష్ర్టం ఏర్పడబోతోంది కాబట్టి ఈ సంఘం ఏర్పాటు చేశాం’’ అన్నారు ప్రేమ్‌రాజ్. అల్లాణి శ్రీధర్ అధ్యక్షుడిగా శనివారం తెలంగాణ దర్శకుల సంఘం ఏర్పాటైంది. ప్రేమ్‌రాజ్ ఉపాధ్యక్షుడు. ఈ సంఘం ఏర్పాటు గురించి ప్రేమ్‌రాజ్ మరిన్ని విషయాలు చెబుతూ -‘‘విజయవాడకు చెందిన ఓ వ్యక్తి తెలంగాణ కళా దర్శకుల సంఘం ప్రారంభించి, డబ్బులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికొచ్చింది. అందుకే అధికారికంగా ఈ తెలంగాణ దర్శకుల సంఘాన్ని ఏర్పాటు చేశాం’’ అన్నారు. ప్రస్తుతం ఉన్న దర్శకుల సంఘానికి ఈ సంఘాన్ని పోటీగా భావించడంలేదని జితేందర్ చెప్పారు. 
 ఇంకా ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ, రవీందర్, చంద్రకాంత్‌రెడ్డి, శ్రీధర్ బీచ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement