తమిళ 'క్వీన్' ఆగిపోయిందా..! | Tamil remake of 'Queen' shelved | Sakshi
Sakshi News home page

తమిళ 'క్వీన్' ఆగిపోయిందా..!

Apr 12 2017 1:50 PM | Updated on Sep 5 2017 8:36 AM

తమిళ 'క్వీన్' ఆగిపోయిందా..!

తమిళ 'క్వీన్' ఆగిపోయిందా..!

బాహుబలి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తమన్నా, లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే అభినేత్రి

బాహుబలి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తమన్నా, లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే అభినేత్రి సినిమాతో ట్రై చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అయితే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని భావించిన క్వీన్ రీమేక్ లో నటించే అవకాశం రావటంతో తెగ సంబరపడిపోయింది. మోస్ట్ టాలెంటెడ్ రేవతి దర్శకత్వంలో సుహాసిన మణిరత్నం రైటర్ గా క్వీన్ సినిమాను రీమేక్ చేయాలని భావించారు.

అయితే తాజాగా క్వీన్ రీమేక్ ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. కారణలేంటో సరిగా తెలియకపోయినా.. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లే ఆలోచన లేదని యూనిట్ సభ్యులు చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. క్వీన్ రీమేక్ తో నటిగానూ ప్రూవ్ చేసుకోవాలని భావించిన తమన్నాకు ఆ కోరిక తీరేలా కనిపించటం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement