ఆ జంటను మూడోసారి కలుపుతారట.. | tamannah may act with chithu third time? | Sakshi
Sakshi News home page

ఆ జంటను మూడోసారి కలుపుతారట..

Apr 28 2015 9:01 AM | Updated on Sep 3 2017 1:02 AM

ఆ జంటను మూడోసారి కలుపుతారట..

ఆ జంటను మూడోసారి కలుపుతారట..

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా మరోసారి నాగ చైతన్యతో జతకట్టే అవకాశం కనిపిస్తోంది.

హైదరాబాద్: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా మరోసారి నాగ చైతన్యతో జతకట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించి చూడ చక్కని జోడి అనిపించుకున్న వీరిద్దరు మరోసారి వెండితెరపై చిందేయనున్నారు. ఇద్దరు కూడా మిల్క్ బాయ్, మిల్క్ గర్ల్గా ఉంటారు. సినీ వర్గాల సమాచారం మేరకు చందు మొండేటి దర్శకత్వం వహించనున్న నాగ చైతన్య చిత్రంలో తమన్నాను కథానాయికగా ఎంపిక చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ప్రారంభంకానున్న షూటింగ్ ద్వారా వీరిద్దరు మరోసారి కెమెరా ముందుకు వచ్చే అవకాశం ఉందట.

ఇప్పటికే100 % లవ్ స్టోరీ చిత్రంలో బావ మరదళ్లుగా వీరు చేసిన హంగామా.. అంతా ఇంతా కాదు. బావ మరదళ్లు అంటే ఇలా ఉండాలి అనిపించేలా అందరిమనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక తడాఖా సినిమాలో కూడా వీరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కవుట్ అయింది. ఆ రెండు చిత్రాలు కూడా సూపర్ హిట్ కావడంతో మరోసారి ఈ హిట్ కాంబినేషన్కు ప్లాన్ చేశారట చిత్ర దర్శకుడు. ఇప్పటికే పలు చిత్రాల్లో బిజీగా ఉన్న ఈ అమ్మడుకు ఇంకా కథ వినిపించలేదని, తాము అనుకున్న ప్రకారం జరిగితే మరోసారి ఈ జంట ప్రేక్షకులను పలకరిస్తుందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement