అల్లుడు శీనుతో మిల్కీ బ్యూటీ రొమాన్స్

అల్లుడు శీనుతో మిల్కీ బ్యూటీ రొమాన్స్


మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ లో మళ్లీ జోరు పెంచింది. వరుసగా సినిమాలు చేస్తోంది. ఇప్పటికే రెండు భారీ సినిమాల్లో నటిస్తున్న ఈ అందాల భామ మరో సినిమాకు సంతకం చేసింది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ తో జతకట్టేందుకు తమన్నా అంగీకరించింది. అల్లుడు శీనుతో తెరంగ్రేటం చేసిన శ్రీనివాస్ రెండో సినిమాకు రెడీ అవుతున్నాడు. దీనికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నాడు.ఈ సినిమాలో నటిస్తున్నట్టు తమన్నా ధ్రువీకరించింది. స్క్రిప్ట్ తనకెంతో నచ్చిందని, తన పాత్ర బాగా కుదిరిందని ఆమె తెలిపింది. మిగతా వివరాలు వెల్లడించేందుకు ఆమె నిరాకరించింది. ఈ సినిమా షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పింది. అయితే శ్రీనివాస్ తో మొదటి సినిమాలోనే తమన్నా నటించింది. అల్లుడు శీను లో ఐటెం సాంగ్ లో తమన్నా మెరిసింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top