కొంత ఇస్తే చాలదట! | Tamanna not in Sivakarthikeyan's Rajini Murugan film | Sakshi
Sakshi News home page

కొంత ఇస్తే చాలదట!

Sep 19 2014 1:09 AM | Updated on Aug 28 2018 4:30 PM

కొంత ఇస్తే చాలదట! - Sakshi

కొంత ఇస్తే చాలదట!

దక్షిణాది చిత్రాలను పెడచెవిన పెట్టి ఆ మధ్య బాలీవుడ్ మోహంలో పడ్డ తమన్నకు అక్కడ అచ్చి రాలేదు. దీంతో మళ్లీ దక్షిణాదే దిక్కంటూ తిరుగుటపా కట్టింది. టాలీవుడ్‌లో ఒకటి రెండు

 దక్షిణాది చిత్రాలను పెడచెవిన పెట్టి ఆ మధ్య బాలీవుడ్ మోహంలో పడ్డ తమన్నకు అక్కడ అచ్చి రాలేదు. దీంతో మళ్లీ దక్షిణాదే దిక్కంటూ తిరుగుటపా కట్టింది. టాలీవుడ్‌లో ఒకటి రెండు చిత్రాలు రావడంతో అమ్మడు మల్లీ చెట్టెక్కి కూర్చొందనే టాక్ వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే కోలీవుడ్‌లో వరుస విజయాలతో మంచి జోరు మీదున్న యువ నటుడు శివకార్తికేయన్ దృష్టి తమన్నపై పడిందట. ఈయన నటించనున్న తాజా చిత్రంలో తమన్నతో డ్యూయెట్లు పాడాలని ఆశపడుతున్నారట. రజనీ మురుగన్ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని దర్శకుడు లింగుస్వామి నిర్మించనున్నారు.
 
 దీంతో నిర్మాతల వర్గం, ఎంపిక చేసే హీరోయిన్ల జాబితాలో తమన్న పేరు మొదటి వరసలో చోటు చేసుకుందట. అయితే రజనీ మురుగన్ చిత్రం కోసం తమన్నను సంప్రదించగా ‘నాకు బాలీవుడ్‌లో అంత పారితోషికం ఇస్తున్నారు. టాలీవుడ్‌లో ఇంత పారితోషికం పుచ్చుకుంటున్నాను. మీరు మాత్రం కొంత ఇస్తే చాలదు.’ అంటూ పెద్ద మొత్తంలో లిస్ట్ ఇచ్చిందట. దీంతో నిర్మాత కళ్లు బైర్లు కమ్మాయట. తమిళంలో మీకంత మార్కెట్ లేదు, బిజినెస్ లేదు. మీరు అడిగిన పారితోషికంతో నయనతారనే ఎంపిక చేసుకోవచ్చు అంటూ రుసురుసలాడుతూ తిరిగొచ్చేశారట. ఈ విషయం అటుంచితే ఈ మిల్కీ బ్యూటీతో రొమాన్స్ చేయాలన్న కోరిక తీరలేదన్న చింత శివకార్తికేయన్‌ను వెంటాడుతోందట.
 

Advertisement
 
Advertisement
Advertisement