చిరు-కొరటాల మూవీలో తమన్నా! | Tamanna May Act In Chiranjeevi Koratala Siva Movie | Sakshi
Sakshi News home page

Sep 27 2018 3:55 PM | Updated on Sep 27 2018 4:35 PM

Tamanna May Act In Chiranjeevi Koratala Siva Movie - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తరువాత చిరు కొరటాల కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో  సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

అయితే ఈ సినిమాలో చిరుకు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో  పవన్‌ కళ్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌లతో నటించిన తమన్నా చిరుతో పూర్తిస్థాయి చిత్రంలో నటించేందుకు రెడీ అవుతోందన్న మాట. ‘రచ్చ’ సినిమా రిలీజ్‌ సమయంలో.. తమన్నాతో కలిసి నటించాలని ఉందని చిరు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమన్నా ‘సైరా’లో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement