బాలీవుడ్‌పై మోజుపడుతున్న మిల్కీ బ్యూటీ | tamanna efforts on bollywood movies | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌పై మోజుపడుతున్న మిల్కీ బ్యూటీ

Dec 18 2017 8:02 PM | Updated on Apr 3 2019 6:34 PM

tamanna efforts on bollywood movies - Sakshi

తమిళసినిమా: దక్షిణాదిలో ప్రముఖ కథానాయికలుగా రాణిస్తున్నా, చాలా మందికి బాలీవుడ్‌ డ్రీమ్‌ మాత్రం కలగానే మిగిలిపోతోంది. నటి తమన్నా ఈ కోవలోకే చేరుతుంది. హిమ్మత్‌వాలా, షకలకల్స్‌ చిత్రాల్లో అందాలను ఆరబోసినా ఫలితం దక్కలేదు. తమన్నా ఈ సారి తన భాణీ మార్చుకుంది. యాక్షన్‌ అవతారంతో పోరాటానికి సిద్ధం అవుతోంది. ఈ అందాల భామకు టాలీవుడ్‌లో మంచి విజయాలు ఉన్నా, కోలీవుడ్‌లో తక్కువే. ఇంకా చెప్పాలంటే హిందీలో విజయాల కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. 

నిజానికి తమన్నా నట కేరీర్‌ను బాలీవుడ్‌లోనే ప్రారంభించింది. 2005లో శభా షమీస్‌ చిత్రం ద్వార తెరంగేట్రం చేసిన ఈ మిల్కీబ్యూటీ అప్పటి నుంచి పుష్కర కాలం పాటు బాలీవుడ్‌లో సరైన హిట్‌ కోసం పోరాడుతూనే ఉంది. ఇప్పటికీ చెప్పుకోదగ్గ విజయం అక్కడ వరించలేదు. టాలీవుడ్‌లో మాత్రం మంచి విజయాలు అందుకుంది. కోలీవుడ్‌లోనూ విక్రమ్‌కు జంటగా నటిస్తున్న ‘స్కెచ్‌’  చిత్రం మాత్రమే చేతిలో ఉంది. 

అయితే ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాలు, హిందీలో ఒక చిత్రంలో నటిస్తూ నటిగా బిజీగానే ఉంది. కాగా ఇప్పటి వరకూ గ్లామర్‌కే పరిమితమైనా బాహుబలి చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాల్లోనూ చక్కగా నటించి ఆల్‌రౌండర్‌ అనిపించుకుంది. తాజాగా హిందీలో ఈ తరహా నటనను ప్రదర్శించి రాణించాలనుకుంటోంది. ఇప్పటికే కామోష్‌ అనే హిందీ చిత్రంలో నటిస్తున్న తమన్నా తాజాగా మరో చిత్రానికి సంతకం చేసింది. జాన్‌ అబ్రహంతో రొమాన్స్‌ చేయనున్న ఈ అమ్మడికి పలు యాక్షన్‌ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని సమాచారం. మిలాబ్‌ జవేరి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం జనవరిలో సెట్‌ పైకి వెళ్లనుంది. ఈ చిత్రం అయినా తమన్నాకు విజయాన్ని అందింస్తుందో? లేదో? చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement