ఏడుసార్లు చెంపదెబ్బ తిన్నా | Taapsee Pannu Reveals Co-star Pavail Gulati Slapped | Sakshi
Sakshi News home page

ఏడుసార్లు చెంపదెబ్బ తిన్నా

Feb 27 2020 3:09 AM | Updated on Feb 27 2020 4:36 AM

Taapsee Pannu Reveals Co-star Pavail Gulati Slapped - Sakshi

ఆర్టిస్టుల తప్పిదం వల్లో, సాంకేతిక కారణాల వల్లో, దర్శకుడు సంతృప్తి చెందకపోవడం వల్లో కొన్నిసార్లు చేసిన సన్నివేశాన్నే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తుంది. ‘తప్పడ్‌’ సినిమా షూటింగ్‌లో అలాంటి సందర్భమే ఒకటి ఎదురైందట తాప్సీకి. ఒక సన్నివేశం కోసం ఆమె సుమారు ఏడుసార్లు చెంపదెబ్బ తిన్సాలి వచ్చిందట. అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో తాప్సీ నటించిన తాజా చిత్రం ‘తప్పడ్‌’ (చెంపదెబ్బ అని అర్థం). ఈ సినిమాలో ఓ సన్నివేశంలో తాప్సీ చెంపదెబ్బ తినాలి.

సినిమాలో చాలా కీలకమైన సన్నివేశం అది. కథను మలుపు తిప్పే చెంపదెబ్బ అది. కరెక్ట్‌గా రావడం కోసం సుమారు ఏడు టేక్‌లు చేశారట తాప్సీ, నటుడు పావైల్‌ గులాటీ. అంటే... ఏడుసార్లు చెంప దెబ్బ తిన్నారట తాప్సీ. ‘‘చెంపదెబ్బ కొట్టడానికి నా కోస్టార్‌ పావైల్‌ సంకోచించారు. చాలా టెన్షన్‌ పడ్డారు. ఆరు టేక్‌లు పూర్తయ్యాయి. సరిగ్గా రావడం లేదు. ‘ఏం ఆలోచించకు. లాగిపెట్టి కొట్టేయ్‌’ అన్నాను. ఏడో టేక్‌ సరిగ్గా వచ్చింది’’ అని ఆ సీన్‌ తీయడానికి వెనక జరిగిన స్టోరీ చెప్పారు తాప్సీ. ‘తప్పడ్‌’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement