పెళ్లి అని కాస్త టెన్షన్ పడ్డాను: నటి | Taapsee Pannu feels thrilled and nervous about pre wedding | Sakshi
Sakshi News home page

పెళ్లి అని కాస్త టెన్షన్ పడ్డాను: నటి

Jan 18 2017 9:29 PM | Updated on Sep 5 2017 1:32 AM

పెళ్లి అని కాస్త టెన్షన్ పడ్డాను: నటి

పెళ్లి అని కాస్త టెన్షన్ పడ్డాను: నటి

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లి విజయాలబాట పట్టిన బ్యూటీ తాప్సీ పన్ను.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లి విజయాలబాట పట్టిన బ్యూటీ తాప్సీ పన్ను. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ తనకు ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించిందని చెబుతోంది ఈ బ్యూటీ. అదేంటీ తాప్సీ పెళ్లి వార్తలు బయటకు రాకుండానే ప్రీ వెడ్డింగ్ ప్లాన్‌లో ఉందని అనుకుంటున్నారా. ప్రస్తుతం తాప్సీ 'రన్నింగ్ షాదీ.కామ్' మూవీలో నటిస్తోంది. అయితే మూవీ ప్రమోషన్లో భాగంగా పెళ్లికి ముందు జరిపే సంగీత్ ఇతరత్రా ఈవెంట్లలో పాల్గొనాల్సి వచ్చింది. దీంతో తనకు నిజంగానే పెళ్లి జరుగుతుందని ఆందోళన చెందానని, కేవలం మూవీ కోసమే ఇలా చేస్తున్నానని గుర్తుకొచ్చి అదే సమయంలో చాలా ఎంజాయ్ చేశానంటోంది తాప్సీ. సంగీత్ వేడుకలో అయితే తాప్సీ నిజమైన పెళ్లికూతురు అని భావించి అదే తరహాలో తనను ట్రీట్ చేయడాన్ని.. ఈ పెళ్లిని కూడా ఎప్పటికీ మరిచిపోలేననని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

తమ సంగీత్‌లో పాల్గొనడంతో గుజరాతీ వధూవరులు ఆశ్చర్చపోయారని, తాను వస్తున్న సంగతి వారికి తెలియదని చెప్పింది. సడన్ సర్ ప్రైజ్ ఇవ్వడంతో పాటు డాన్స్ చేసి అక్కడివారిలో ఉత్సాహాన్ని పెంచింది. మూవీ ప్రమోషన్లో భాగంగా కొద్దిసేపు తాప్సీ వధువుగా ఈవెంట్లో పాల్గొంది. ఆ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది 'పింక్' ఫేమ్ తాప్సీ. 1971లో జరిగిన భారత్ , పాకిస్థాన్ యుద్ధ సమయంలో సముద్ర గర్భంలో అదృశ్యమయిన సబ్ మెరైన్ 'ఘాజీ' నేపథ్యంలో తెరకెక్కుతున్న ఘాజీ మూవీలోనూ ఆమె నటిస్తోంది.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement