breaking news
Runningshaadi.com
-
అదే నాకు ప్లస్ పాయింట్: నటి
కోల్ కతా: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిన నటి తాప్సీ పన్ను తాను నటనలో శిక్షణ తీసుకున్న వ్యక్తిని కాదని అంటోంది. అయితే ఇదే ఆమెకు ప్లస్ పాయింట్ గా మారిందట. ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సినిమా గురించి పలు విషయాలను షేర్ చేసుకుంది. 'నేను నటనలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. ఇదే నాకు ప్లస్ పాయింట్. ఎందుకంటే సన్నివేశానికి తగ్గట్లుగా సహజంగా నా నటన ఉంటుంది. ప్రేక్షకులు నా నుంచి ఇదే ఆశిస్తున్నారు. బేబీ, పింక్ మూవీలను ఆదరించినందిన అందరికీ కృతజ్ఞతలు. ఇంకా చెప్పాలంటే కామెడీ చేయడం కంటే తనకు సహజంగా నటించే పాత్రల్లో లీనమైపోవడమే చాలా తేలిక' అని నటి తాప్పీ తెలిపింది. తాప్పీ ప్రధాన పాత్రలో అమిత్ రాయ్ దర్శకత్వంలో సూజిత్ సర్కార్ నిర్మించి.. తెరకెక్కిస్తోన్న మూవీ రన్నింగ్ షాదీ.కామ్. ఇందులో తన పాత్ర పేరు నిమ్మి అని, గతంలో తాను చేసిన పాత్రలకు ఇది కాస్త భిన్నంగా ఉంటుందని చెబుతోంది. తక్కువ మూవీలు చేస్తారేందుకని అడుగుతున్నారు.. కానీ తాను గత మూడేళ్లుగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను అంటోంది. ఇంకా చెప్పాలంటే ఈ ఏడాది ఐదు మూవీలతో మీ ముందుకు వస్తున్నాను అంటూ నవ్వేసింది ఈ ముద్దుగుమ్మ. తాప్సీ నటపై ఉన్న నమ్మకంతోనే ఆమెకు పింక్, 'రన్నింగ్ షాదీ.కామ్'లలో అవకాశాలు వచ్చాయని సూజిత్ సర్కార్ అన్నారు. తాప్సీ నటించిన మరో మూవీ 'నామ్ షబానా' మార్చి 31న విడుదలకు సిద్ధంగా ఉంది. -
పెళ్లి అని కాస్త టెన్షన్ పడ్డాను: నటి
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లి విజయాలబాట పట్టిన బ్యూటీ తాప్సీ పన్ను. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ తనకు ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించిందని చెబుతోంది ఈ బ్యూటీ. అదేంటీ తాప్సీ పెళ్లి వార్తలు బయటకు రాకుండానే ప్రీ వెడ్డింగ్ ప్లాన్‌లో ఉందని అనుకుంటున్నారా. ప్రస్తుతం తాప్సీ 'రన్నింగ్ షాదీ.కామ్' మూవీలో నటిస్తోంది. అయితే మూవీ ప్రమోషన్లో భాగంగా పెళ్లికి ముందు జరిపే సంగీత్ ఇతరత్రా ఈవెంట్లలో పాల్గొనాల్సి వచ్చింది. దీంతో తనకు నిజంగానే పెళ్లి జరుగుతుందని ఆందోళన చెందానని, కేవలం మూవీ కోసమే ఇలా చేస్తున్నానని గుర్తుకొచ్చి అదే సమయంలో చాలా ఎంజాయ్ చేశానంటోంది తాప్సీ. సంగీత్ వేడుకలో అయితే తాప్సీ నిజమైన పెళ్లికూతురు అని భావించి అదే తరహాలో తనను ట్రీట్ చేయడాన్ని.. ఈ పెళ్లిని కూడా ఎప్పటికీ మరిచిపోలేననని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. తమ సంగీత్‌లో పాల్గొనడంతో గుజరాతీ వధూవరులు ఆశ్చర్చపోయారని, తాను వస్తున్న సంగతి వారికి తెలియదని చెప్పింది. సడన్ సర్ ప్రైజ్ ఇవ్వడంతో పాటు డాన్స్ చేసి అక్కడివారిలో ఉత్సాహాన్ని పెంచింది. మూవీ ప్రమోషన్లో భాగంగా కొద్దిసేపు తాప్సీ వధువుగా ఈవెంట్లో పాల్గొంది. ఆ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది 'పింక్' ఫేమ్ తాప్సీ. 1971లో జరిగిన భారత్ , పాకిస్థాన్ యుద్ధ సమయంలో సముద్ర గర్భంలో అదృశ్యమయిన సబ్ మెరైన్ 'ఘాజీ' నేపథ్యంలో తెరకెక్కుతున్న ఘాజీ మూవీలోనూ ఆమె నటిస్తోంది.