త్వరలో గృహప్రవేశం చేస్తా! | Taapsee bought a flat in Mumbai. | Sakshi
Sakshi News home page

త్వరలో గృహప్రవేశం చేస్తా!

Aug 7 2017 2:12 AM | Updated on Oct 4 2018 4:27 PM

త్వరలో గృహప్రవేశం చేస్తా! - Sakshi

త్వరలో గృహప్రవేశం చేస్తా!

కొందరు జీవితంలో లక్ష్యాలే లేవంటారు. మరి కొందరు భవిష్యత్‌ ప్రణాళికలే ఉండవంటారు.

తమిళసినిమా: కొందరు జీవితంలో లక్ష్యాలే లేవంటారు. మరి కొందరు భవిష్యత్‌ ప్రణాళికలే ఉండవంటారు. మరి కొందరు లక్ష్యం దిశగా పయనిస్తారు. ఇటీవల సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన తాప్సీ తన లక్ష్యాన్ని అధిగమించనంటోంది. ఆడగళం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు, ఝుమ్మందినాదం చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈఢిల్లీ బ్యూటీ తెలుగులో కాస్త ఎక్కువ చిత్రాలే చేసినా, కోలీవుడ్‌లో చాలా తక్కువ చిత్రాలనే చేసింది. ఇక్కడ అవకాశాలు అడుగంటాయి.దీంతో ముంబైలో మకాం పెట్టింది.

లక్కీగా అక్కడ పింక్, నామ్‌ షబానా వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చి పెట్టడంతో ఇక అక్కడే సెటిల్‌ కావాలని నిర్ణయించుకుందట.దీంతో ముంబైలో సొంత నివాసం, ఒక సొగసైన కారు కొనుక్కోవాలని, అది తన పుట్టిన రోజు లోపే సాధించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందట. ఆ అమ్మడికి ఆగస్ట్‌ ఒకటో తేదీ పుట్టిన రోజు. కాగా ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఫ్లాట్‌ను ఇటీవలే కొనుగోలు చేసిందట. తాప్సీ తెలుపుతూ తన పుట్టిన రోజుకు ముందే సొంతంగా ఇల్లు కొనుక్కోవాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నానని అంది. థ్యాంక్స్‌ గాడ్‌ అంతకు ముందే తన లక్ష్యాన్ని అధిగమించాను అని పేర్కొంది. ప్రస్తుతం ఫ్లాట్‌లో చిన్న చిన్న వర్క్‌ జరుగుతోందని, త్వరలోనే తన సోదరితో కలిసి గృహ ప్రవేశం చేస్తానని అంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement