Sye Raa Collections | Sye Raa Narasimha Reddy First Day Box Office Collections Prediction - Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్‌ను షేక్‌ చేయనున్న ‘సైరా’

Oct 1 2019 4:09 PM | Updated on Oct 2 2019 1:42 PM

Sye Raa Narasimha Reddy Box Office Prediction - Sakshi

ఈ రెండు సినిమాలు మొదటి రోజు ఎంత వసూలు చేస్తాయనే దానిపై మార్కెట్‌ విశ్లేషకులు అంచనాలు కడుతున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ బుధవారం విడుదలకానున్న నేపథ్యంలో బాక్సాఫీస్‌ వద్ద సందడి నెలకొంది. దాదాపు రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీంతో పాటు బాలీవుడ్‌ సినిమా ‘వార్‌’  కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ రెండు సినిమాలు మొదటి రోజు ఎంత వసూలు చేస్తాయనే దానిపై మార్కెట్‌ విశ్లేషకులు అంచనాలు కడుతున్నారు.

‘సైరా నరసింహారెడ్డి’ తొలి రోజు దక్షిణాదిలో రూ. 30 కోట్లు రాబట్టే అవకాశముందని ప్రముఖ ఫిల్మ్‌ ట్రేడ్‌ విశ్లేషకుడు గిరీశ్‌ జోహార్‌ పేర్కొన్నారు. ఇక వార్‌ సినిమా ఫస్ట్‌ డే కలెక్షన్లు రూ. 45 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. ‘దక్షిణాదిలో చిరంజీవి పెద్ద స్టార్‌. ఆయన తాజా చిత్రం భారీ ఎత్తున విడుదలవుతోంది. అడ్వాన్స్‌ బుకింగ్‌ కూడా బ్రహ్మండంగా ఉన్నాయి. హిందీకి వచ్చేసరికి వార్‌ సినిమాకే మొదటి ప్రాధాన్యం దక్కుతుంది. వార్‌ సినిమా ఎలా ఉంటుందనే దానిపైనే బాలీవుడ్‌లో సైరా సినిమా కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి. సౌత్‌లో మాత్రం సైరా బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతుందని కచ్చితంగా చెప్పగలను’ అంటూ గిరీశ్‌ జోహార్‌ వివరించారు. కాగా, ‘సైరా నరసింహారెడ్డి’లో సినిమాతో చిరంజీవి సరికొత్త చరిత్రను లిఖించనున్నారని యూఏఈ సెన్సార్‌ బోర్డు సభ్యుడు ఉమైర్‌ సంధు ప్రశంసించారు. మరోవైపు ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకానున్న థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అభిమానులు భారీ ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేశారు.
(చదవండి: ‘సైరా’ ఫస్ట్‌ రివ్యూ)

వార్‌ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్‌ టికెట్ల అమ్మకాలు బాగున్నాయని, ఇప్పటికే రూ. 25 కోట్లు వచ్చాయని వెల్లడించారు. సినిమా బాగుందని టాక్‌ వస్తే ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌’ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్‌ రికార్డు(రూ.27.5 కోట్లు)ను వార్‌ అధిగమిస్తుందని జోస్యం చెప్పారు. వరుస సెలవులు ఉండడంతో కలెక్షన్లు భారీగానే ఉండే అవకాశముందని గిరీశ్‌ జోహార్‌ అంచనా వేశారు. (చదవండి: ‘సైరా’ను ఆపలేం.. )

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి.. సైరా ఫుల్‌ రివ్యూ (4/5)

Advertisement
 
Advertisement
Advertisement