కార్తికేయ పెళ్లి వీడియో షేర్‌ చేసిన సుస్మితా సేన్ | Sushmita Sen Shares Karthikeya Wedding Video | Sakshi
Sakshi News home page

Jan 2 2019 2:32 PM | Updated on Jan 2 2019 5:38 PM

Sushmita Sen Shares Karthikeya Wedding Video - Sakshi

దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం, జగపతి బాబు సోదరుడి కుమార్తె పూజా ప్రసాద్‌తో జరిగిన సంగతి తెలిసిందే. రాజస్తాన్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు హాజరై నూతన జంటకు ఆశీస్సులు అందజేశారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వివాహ వేడుకకు సంబంధించిన విశేషాలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

తన పిల్లలతో(దత్తత తీసుకున్న) కలిసి ఈ వివాహ వేడుకకు హాజరైన ప్రముఖ హీరోయిన్‌ సుస్మితా సేన్‌ పెళ్లి చాలా అందంగా జరిగిందని పేర్కొన్నారు. పెళ్లిలో కార్తికేయ, పూజాలు తలంబ్రాలు పోసుకుంటున్న వీడియోను ఆమె షేర్‌ చేశారు. ‘తలంబ్రాల్లోని ప్రతి ధాన్యం గింజ మీ ఇరువురికి దీవెనలు, ప్రేమ, ఆనందం, సిరిసంపదలు తీసుకురావాలని కోరుకుంటున్నాన’ని తెలిపారు. అంతేకాకుండా ప్రభాస్‌తోపాటు, తన బాయ్‌ ఫ్రెండ్‌ రోహ్మాన్ షాల్‌తో దిగిన ఫొటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

2018లో నాకిష్టమైన ఫొటో: రానా
రానా కూడా కార్తికేయ, పూజాలకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. వారిద్దరు జీలకర్ర, బెల్లం పెట్టుకున్న ఫొటోను షేర్‌ చేసిన రానా ఇది 2018లో తనకు ఇష్టమైన ఫొటో అని పేర్కొన్నారు. ఆ ఫొటో తీసింది ఉపాసన కొణిదెల అని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement