అందరికోసం మేము | surya new movie memu | Sakshi
Sakshi News home page

అందరికోసం మేము

Nov 12 2015 10:57 PM | Updated on Sep 3 2017 12:23 PM

అందరికోసం మేము

అందరికోసం మేము

చిన్నపిల్లల మనోభావాలు, మానసిక సంఘర్షణల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘పసంగ 2’.

చిన్నపిల్లల మనోభావాలు, మానసిక సంఘర్షణల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘పసంగ 2’. పాండిరాజా దర్శకత్వంలో తమిళంలో హీరో సూర్య నటిస్తూ నిర్మించిన చిత్రమిది. సూర్య, కె.ఇ. జ్ఞానవేల్ రాజా సమర్పణలో ఈ చిత్రాన్ని ‘మేము’ పేరుతో జూలకంటి మధుసూదన్‌రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సూర్య మాట్లాడుతూ - ‘‘మా సంస్థలో తొలి చిత్రంగా ‘36 వయదినిలే’ తీశాం.

ఆ తరువాత వస్తున్న చిత్రం ‘మేము’. పాండిరాజ్ ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశారు. పిల్లల కథాంశమైనా కూడా అందరికీ నచ్చే విధంగా తీశాం’’ అన్నారు. ఈ వేడుకలో అమలాపాల్, కె.ఇ. జ్ఞానవేల్ రాజా, దర్శకుడు పాండిరాజ్, సంగీత దర్శకుడు అర్రోల్ కొరెల్లి, మాచర్ల ఎమ్మెల్యే పి. రామకృష్ణారెడ్డి, శివకృష్ణ, నిర్మాతలు తమటం కుమార్‌రెడ్డి, ప్రసాద్ సన్నితి, కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement