తగ్గాల్సిందే.. తప్పదు! | surya about weight loss about his movis | Sakshi
Sakshi News home page

తగ్గాల్సిందే.. తప్పదు!

Nov 17 2016 11:12 PM | Updated on Sep 4 2017 8:22 PM

తగ్గాల్సిందే.. తప్పదు!

తగ్గాల్సిందే.. తప్పదు!

బరువు పెరగడం చాలా ఈజీ. తగ్గడం మాత్రం చాలా చాలా కష్టం. ఒకటీ రెండు కిలోలు తగ్గాలంటేనే నానా తంటాలూ పడాలి

బరువు పెరగడం చాలా ఈజీ. తగ్గడం మాత్రం చాలా చాలా కష్టం. ఒకటీ రెండు కిలోలు తగ్గాలంటేనే నానా తంటాలూ పడాలి. ఇక.. పది కిలోలు తగ్గాలంటే పెద్ద విషయమే. ఇప్పుడు సూర్య ఈ పని మీదే ఉన్నారు. కొన్నేళ్ళ క్రితం ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రంలో టీనేజ్ బాయ్ క్యారెక్టర్ కోసం ఈ మాస్ హీరో బరువు తగ్గారు. ఆ తర్వాత మళ్లీ మామూలు బరువుకి చేరుకున్నారు. ప్రస్తుతం ‘తానా సేంద కూట్టమ్’ అనే తమిళ సినిమా కోసం సూర్య బరువు తగ్గక తప్పడం లేదు.

విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో సూర్య తన వయసు కన్నా పదేళ్లు తగ్గి కనిపించాలట. అంటే.. 30 ఏళ్ల యువకుడిలా కనిపించాల్సి ఉంటుంది. ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కావడానికి కాస్త టైమ్ ఉంది. ఈలోపు పది కిలోలు తగ్గడానికి ఏమేం చేయాలో సూర్య అన్నీ చేస్తున్నారు. కేవలం బరువు తగ్గి, కుర్రాడిలా కనిపించడం మాత్రమే కాదు. ఓ కొత్త రకం హెయిర్ స్టైల్‌లో కూడా కనిపించనున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన కీర్తీ సురేశ్ కథానాయికగా నటించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement