breaking news
Tana senda kuttam
-
తగ్గాల్సిందే.. తప్పదు!
బరువు పెరగడం చాలా ఈజీ. తగ్గడం మాత్రం చాలా చాలా కష్టం. ఒకటీ రెండు కిలోలు తగ్గాలంటేనే నానా తంటాలూ పడాలి. ఇక.. పది కిలోలు తగ్గాలంటే పెద్ద విషయమే. ఇప్పుడు సూర్య ఈ పని మీదే ఉన్నారు. కొన్నేళ్ళ క్రితం ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రంలో టీనేజ్ బాయ్ క్యారెక్టర్ కోసం ఈ మాస్ హీరో బరువు తగ్గారు. ఆ తర్వాత మళ్లీ మామూలు బరువుకి చేరుకున్నారు. ప్రస్తుతం ‘తానా సేంద కూట్టమ్’ అనే తమిళ సినిమా కోసం సూర్య బరువు తగ్గక తప్పడం లేదు. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో సూర్య తన వయసు కన్నా పదేళ్లు తగ్గి కనిపించాలట. అంటే.. 30 ఏళ్ల యువకుడిలా కనిపించాల్సి ఉంటుంది. ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కావడానికి కాస్త టైమ్ ఉంది. ఈలోపు పది కిలోలు తగ్గడానికి ఏమేం చేయాలో సూర్య అన్నీ చేస్తున్నారు. కేవలం బరువు తగ్గి, కుర్రాడిలా కనిపించడం మాత్రమే కాదు. ఓ కొత్త రకం హెయిర్ స్టైల్లో కూడా కనిపించనున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన కీర్తీ సురేశ్ కథానాయికగా నటించనున్నారు. -
సూర్య గుంపులో కీర్తి!
‘తానా సేంద కూట్టమ్’... విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించబోయే సినిమాకి ఈ టైటిల్ ఖరారు చేశారు. ‘దానంతట అదే ఏర్పడిన గుంపు’ అని ఈ టైటిల్ అర్థమట. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞాన్వేల్ రాజా నిర్మించనున్నారు. ఈ గుంపులో ‘నేను శైలజ’ ఫేమ్ కీర్తీ సురేశ్ కూడా చేరారు. సూర్యాకు జోడీగా నటించనున్నారామె. హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘స్పెషల్ ఛబ్బీస్’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. నవంబర్‌లో చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారు. తమిళంలో మరో స్టార్ హీరో విజయ్ ‘భైరవ’లో కూడా కీర్తీనే హీరోయిన్. ప్రస్తుతం తెలుగులో ‘పక్కా లోకల్’ సినిమాలో నాని సరసన నటిస్తోందీ భామ. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా క్రిస్మస్కి విడుదల కానుంది.