ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌!

Surveen Chawla Shares Adorable Pic Of Her Daughter - Sakshi

‘ఇప్పుడు చిన్న చిన్న షూలను నింపేందుకు మా దగ్గర తన బుజ్జి బుజ్జి పాదాలు ఉన్నాయి! తన అద్భుతమైన రాకతో మా చిన్న కుటుంబం సంపూర్ణమైంది! మా ముద్దుల కూతురు ఇవాను మా జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నాం’ అంటూ బాలీవుడ్‌ హీరోయిన్‌ సుర్విన్‌ చావ్లా షేర్‌ చేసిన ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఏప్రిల్‌ 15న ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె ప్రస్తుతం మాతృత్వపు లాలిత్యాన్ని అనుభవిస్తున్నారు. ఇందులో భాగంగా తన కూతురి పాదాలతో కూడిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి.. తొలిసారిగా తనను ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా 2015లోనే వ్యాపారవేత్త అక్షయ్‌ టక్కర్‌ను పెళ్లాడిన సుర్విన్‌ రెండేళ్ల వరకు తన పెళ్లికి సంబంధించిన విశేషాలను గోప్యంగా ఉంచారు. 2017లో తాను వివాహితను అని ప్రకటించిన ఆమె‌... ‘ పెళ్లి చేసుకున్నంత మాత్రాన వృత్తిగత జీవితంలో ఎటువంటి మార్పులు రావని నా నమ్మకం. పెళ్లి చేసుకున్న తర్వాత నా అందం, శారీరక సౌందర్యంలో ఎటువంటి మార్పు రాలేదు. పెళ్లైనంత మాత్రాన అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందనే గుడ్డి నమ్మకాన్ని పటాపంచలు చేయడానికే ఇన్నాళ్లు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాను’ అని చెప్పు​కొచ్చారు. ఇక ఏక్తా కపూర్‌ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన పలు టీవీ సీరియళ్లలో నటించిన సుర్విన్‌.. హేట్‌స్టోరి 2, పర్చేద్‌ వంటి బాలీవుడ్‌ సినిమాలతో గుర్తింపు పొందారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top