త్రివిక్రమ్‌ - ఎన్టీఆర్‌ సినిమాకు భారీ ఆఫర్‌

Surprising Rate For NTR Trivikram Movie US Rights - Sakshi

అజ్ఞాతవాసి లాంటి ఘోర పరాజయం తరువాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్, ఎన్టీఆర్‌ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు భారీ ఆఫర్‌ దక్కినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అజ్ఞాతవాసి సినిమా తరువాత త్రివిక్రమ్‌ సినిమాకు క్రేజ్‌ ఉండదేమోనని అంతా అనుకున్నారు. కానీ విడుదలకు ముందే యూఎస్‌ హక్కులను ఓ సంస్థ భారీ మొత్తంలో కొనుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్‌ కొత్త లుక్‌లో కనపడబోతోన్న ఈ చిత్ర యూఎస్‌ హక్కులు దాదాపు పన్నెండు కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాకు తమన్‌ స్వరాలు సమకూర్చుతున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు (మే 20) కానుకగా ఈ సినిమా టైటిల్‌, ఎన్టీఆర్‌ లుక్‌ను రిలీజ్‌ చేయనున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top