సూర్య సినిమా విడుదల వాయిదా | suriyas memu release postponed | Sakshi
Sakshi News home page

సూర్య సినిమా విడుదల వాయిదా

Mar 16 2016 5:09 PM | Updated on Sep 3 2017 7:54 PM

సూర్య సినిమా  విడుదల వాయిదా

సూర్య సినిమా విడుదల వాయిదా

సూర్య ప్రధాన పాత్రలో తన సొంతం నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కిన సినిమా మేము. తమిళ్లో గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు వర్షన్ రిలీజ్కు...

సూర్య ప్రధాన పాత్రలో తన సొంతం నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కిన సినిమా  'మేము'. తమిళ్లో గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు వర్షన్ రిలీజ్కు మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముందుగా తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా, సంక్రాంతికి టాలీవుడ్లో భారీ పోటి ఉండటంతో వాయిదా వేసుకున్నారు.

తరువాత కూడా పలుమార్లు సినిమా రిలీజ్ చేయాలని ప్రయత్నించినా, వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఈ శుక్రవారం(మార్చి 18) ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారు చిత్రయూనిట్. అయితే మరోసారి మేము సినిమాను వాయిదా వేయక తప్పలేదు. వాయిదాకు కారణాలేంటి అన్న విషయం వెల్లడించకపోయినా, మేము చిత్రం శుక్రవారం రిలీజ్ కావటం లేదని ప్రకటించారు. త్వరలో రిలీజ్ డేట్ వెల్లడిస్తామని తెలిపారు చిత్రయూనిట్.

పసంగ సినిమాకు సీక్వల్గా పసంగ 2 పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో మేము పేరుతో రిలీజ్ చేస్తున్నారు. సూర్య సరసన అమలా పాల్ హీరోయిన్గా నటిస్తుండగా తెలుగమ్మాయి బిందు మాధవి మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. చిన్న పిల్లలను ఆకట్టుకునే కథాంశంతో సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకుడు.

Advertisement
 
Advertisement
Advertisement