జూలైలో సెట్స్ మీదకు సూర్య, త్రివిక్రమ్ మూవీ | Suriya's bilingual with Trivikram will roll from July 2016 | Sakshi
Sakshi News home page

జూలైలో సెట్స్ మీదకు సూర్య, త్రివిక్రమ్ మూవీ

Dec 15 2015 1:53 PM | Updated on Sep 3 2017 2:03 PM

జూలైలో సెట్స్ మీదకు సూర్య, త్రివిక్రమ్ మూవీ

జూలైలో సెట్స్ మీదకు సూర్య, త్రివిక్రమ్ మూవీ

చాలా రోజులుగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తానంటూ ఊరిస్తూ వస్తున్న సూర్య ఫైనల్గా, ఆ ముహుర్తాన్నికన్ఫామ్ చేశాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో...

చాలా రోజులుగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తానంటూ ఊరిస్తూ వస్తున్న సూర్య.. ఎట్టకేలకు దానికి ముహూర్తం నిర్ధారించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాను 2016 జూలైలో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

ప్రస్తుతం త్రివిక్రమ్ నితిన్ హీరోగా అ..ఆ.. సినిమాను తెరకెక్కిస్తుండగా, ఇటీవలే 24 షూటింగ్ పూర్తిచేసిన సూర్య, సింగం 3 షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత సూర్య, త్రివిక్రమ్ల కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను త్రివిక్రమ్తో వరుస సినిమాలు చేస్తున్న హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్నారు. త్వరలోనే సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement