కబాలి తరువాత ఎస్3నే..! | suriya s3 movie record in youtube | Sakshi
Sakshi News home page

కబాలి తరువాత ఎస్3నే..!

Nov 10 2016 1:06 PM | Updated on Sep 4 2017 7:44 PM

కబాలి తరువాత ఎస్3నే..!

కబాలి తరువాత ఎస్3నే..!

చాలా రోజులుగా తన రేంజ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సూర్య, 24 సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చాడు. తన మార్క్ ప్రయోగాత్మక చిత్రంతోనే కమర్షియల్ సక్సెస్ కూడా సాధించి సత్తా చాటాడు. ఇప్పుడు తనకు బాగా...

చాలా రోజులుగా తన రేంజ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సూర్య, 24 సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చాడు. తన మార్క్ ప్రయోగాత్మక చిత్రంతోనే కమర్షియల్ సక్సెస్ కూడా సాధించి సత్తా చాటాడు. ఇప్పుడు తనకు బాగా కలిసొచ్చిన సింగం సీరీస్తో మరోసారి తన కలెక్షన్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు సూర్య.

ఈ డిసెంబర్లో రిలీజ్ అవుతున్న ఎస్ 3 సినిమా ఇప్పటికే రికార్డ్ల వేట మొదలు పెట్టింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి తరువాత అంత వేగంగా మూడు మిలియన్ల వ్యూస్ సాధించిన చిత్రంగా నిలిచింది ఎస్3. ఇప్పటికే 4 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఎస్ 3 మరిన్ని రికార్డ్ ల దిశగా దూసుకుపోతోంది. సూర్య సరసన అనుష్క, శృతిహాసన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీత దర్శకుడు.

Advertisement
 
Advertisement
Advertisement