అదరగొడుతున్న ‘ఎన్జీకే’ ట్రైలర్‌ | Suriya NGK Trailer Trending With 4 Million Plus Views | Sakshi
Sakshi News home page

అదరగొడుతున్న ‘ఎన్జీకే’ ట్రైలర్‌

Apr 30 2019 4:08 PM | Updated on May 28 2019 10:06 AM

Suriya NGK Trailer Trending With 4 Million Plus Views - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సెల్వరాఘవన్‌ (శ్రీ రాఘవ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఎన్జీకే. నంద గోపాల కృష్ణ అనేది ట్యాగ్ లైన్‌. ఈ సినిమాను తెలుగులోనూ అదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన సాయి పల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మే 31న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో సూర్య యాక్టింగ్‌ హైలెట్‌గా నిలుస్తోంది. అంతేకాదు తెలుగులోనూ సూర్యనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవటం విశేషం. యువన్‌ శంకర్‌ రాజా నేపథ్యం సంగీతం కూడా సూపర్బ్‌ అనిపించేలా ఉంది. ఇప్పటికే 4 మిలియన్ల(40 లక్షల)కు పైగా వ్యూస్‌ సాధించిన ఈ ట్రైలర్‌ టాప్‌ లో ట్రెండ్‌ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement